తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

వైరల్​గా రేణూ దేశాయ్​ పోస్ట్​.. పవన్​ను ఉద్దేశించి పెట్టిందేనా? - వైరల్​గా రేణుదేశాయ్​ పోస్ట్​

నటి రేణూ దేశాయ్ తాజాగా చేసిన ఓ పోస్ట్ సోషల్​ మీడియాలో వైరల్ అవుతోంది. అది పవన్​ను ఉద్దేశించి పెట్టిందేనంటూ నెటిజన్లు భావిస్తున్నారు. ఇంతకీ అదేంటంటే..

Renudesai post viral on pawankalyan alimony comments
వైరల్​గా రేణూ దేశాయ్​ పోస్ట్​.. పవన్​ను ఉద్దేశించి పెట్టిందేనా

By

Published : Oct 20, 2022, 10:35 PM IST

పవర్​స్టార్​ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వెళ్లాక ఆయన మూడు పెళ్లిళ్ల వ్యవహారం వార్తల్లో నిలుస్తోంది. అయితే ఇటీవలే మరోసారి తనను విమర్శించిన వారిని ప్రతివిమర్శిస్తూ.. మాజీ భార్యలకు తాను ఇచ్చిన భరణం గురించి మాట్లాడారు. మొదటి భార్యకు ఐదు కోట్లు ఇచ్చానని, రెండో భార్యకు తన మిగిలిన ఆస్తినిచ్చానని అన్నారు. రెండో భార్యకు విడాకులు ఇచ్చిన తర్వాతే మూడో పెళ్లి చేసుకున్నానని వ్యాఖ్యానించారు.

అయితే పవన్ కళ్యాణ్ మొదటి భార్యతో విడిపోయిన తర్వాత రేణూ దేశాయ్​ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్​లకు ఇద్దరు సంతానం ఉన్నారు. అయితే విడాకుల సమయంలో రేణు దేశాయ్ చాలా భరణం తీసుకున్నారని వార్తలు వినిపించాయి. దాంతో ఓ ఇంటర్వ్యూలో ఆమె తన దగ్గర ఉన్న ప్రతి రూపాయి తన కష్టార్జితం అని చెప్పింది. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

వైరల్​గా రేణూ దేశాయ్​ పోస్ట్​.. పవన్​ను ఉద్దేశించి పెట్టిందేనా

మరోవైపు పవన్​ చేసిన వ్యాఖ్యల తర్వాత ఆమె చేసిన ఓ పోస్ట్​ ప్రస్తుతం వైరల్​ అవుతోంది. ఆమె ఆ పోస్ట్ ఏ ఉద్దేశంతో చేసిందో తెలియదు కానీ.. నెటిజన్లు మాత్రం వైరల్ చేస్తున్నారు. 'నీ వెర్షన్ కాదు, నా వెర్షన్ కాదు.. నిజం అనేది ఒకటి ఉంటుంది. అది శాశ్వతంగా ఉంటుంది అనేది నేను జీవితంలో నేర్చుకున్న అంశం" అంటూ రేణూ పోస్ట్ చేసింది. రేణూ దేశాయ్ మాటల్లో ఆంతర్యం అర్థం కాక నెటిజన్లు తికమక పడుతున్నారు. ఇంకొంతమంది పవన్​ను ఉద్దేశించే పెట్టిందని అంటున్నారు.

ఇదీ చూడండి:దీపావళి తారా జువ్వలు వీరే బాక్సాఫీస్​ ముందు హిట్​సౌండ్​తో పేలేదెవ్వరో

ABOUT THE AUTHOR

...view details