200 కోట్ల రూపాయల మనీలాండరింగ్ కేసులో బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు ఊరట లభించింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసిన ఈ కేసులో దిల్లీలోని పాటియాలా కోర్టు ఆమెకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. సుకేష్ చంద్రశేఖరన్, ఇతరులు నిందితులుగా ఉన్న 200కోట్ల రూపాయల మనీలాండరింగ్ కేసులో జాక్వెలిన్ లబ్దిదారుగా ఉన్నట్లు ఇటీవలే ఈడీ ఆరోపించింది. సుకేష్ నుంచి ఖరీదైన కార్లు, బహుమతులను ఆమె పొందినట్లు పేర్కొంది. ఈ ఏడాది ఆగస్టు 17న సమర్పించిన అనుబంధ ఛార్జ్ షీట్‌లో నిందితురాలిగా జాక్వెలిన్ పేరును ఈడీ చేర్చింది.
రూ.200 కోట్ల దోపిడీ కేసు.. జాక్వెలిన్‌కు బెయిల్ - jacquelin latest news
200 కోట్ల రూపాయల మనీలాండరింగ్ కేసులో బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు ఊరట లభించింది. ఆమెకు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది.
ఆ ఛార్జ్‌షీట్‌ను పరిగణనలోకి తీసుకున్న కోర్టు ఈనెల 26న న్యాయస్థానంలో హాజరుకావాలని.. సమన్లు జారీచేసింది. ఈ మేరకు కోర్టుకు హాజరైన ఆమె బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా న్యాయస్థానం ఈడీ స్పందన కోరింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ స్పందన తెలిపే వరకూ.. రెగ్యులర్ బెయిల్‌ను పెండింగ్‌లో ఉంచుతున్నట్లు కోర్టు పేర్కొంది. జాక్వెలిన్ న్యాయవాదుల అభ్యర్థన మేరకు న్యాయమూర్తి శైలేంద్ర మాలిక్ మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఇందుకు 50 వేల రూపాయల బాండ్ సమర్పించాలని ఆదేశించారు. తదుపరి విచారణనను అక్టోబరు 22కు వాయిదా వేశారు.
ఇదీ చూడండి:NTR ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. తెలిస్తే పూనకాలే!