తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

పెళ్లి పీటలెక్కిన ప్రముఖ కమెడియన్- నెట్టింట్లో ఫొటోలు వైరల్! - రెడిన్ కింగ్​స్సీ భార్య సంగీత

Redin Kingsley Wedding : ప్రముఖ హాస్య నటుడు రెడిన్‌ కింగ్‌స్లీ వివాహం చేసుకున్నారు. ఆయన వివాహానికి సంబంధిత ఫొటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. మీరూ చూసేయండి.

Redin Kingsley Wife Sangeetha
Redin Kingsley Wife Sangeetha

By ETV Bharat Telugu Team

Published : Dec 10, 2023, 5:26 PM IST

Updated : Dec 10, 2023, 7:57 PM IST

Redin Kingsley Wedding : ప్రముఖ కోలీవుడ్ కమెడియన్ రెడిన్‌ కింగ్స్‌స్లీ పెళ్లి పీటలెక్కారు. చెన్నైకు చెందిన టీవీ ఆర్టిస్ట్​ సంగీతను ఆదివారం పెళ్లి చేసుకున్నారు. ఇరువురి కుటుంబ సభ్యులు, కొంత మంది అతిథుల సమక్షంలో వివాహ బంధంతో ఒకటయ్యారు. ఈ వివాహానికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు, అభిమానులు నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Redin Kingsley Wife Sangeetha : తనదైన శైలి కామెడీతో ప్రేక్షకులను అలరించే రెడిన్ ఇటీవల వచ్చిన రజనీకాంత్​ సినిమా 'జైలర్‌'తో తెలుగు ప్రేక్షకులను దగ్గరయ్యారు. తన కామెడీ టైమింగ్​తో అభిమానులను నవ్వించారు. లేడీ సూపర్ స్టార్ నయనతార లీడ్​ రోల్​లో తెరకెక్కిన 'కొలమావు కోకిల'తో అనే కోలీవుడ్​ సినిమాతో కమెడియన్‌గా కెరీర్‌ ప్రారంభించారు రెడిన్‌. శివ కార్తికేయన్‌ హీరోగా రూపొందిన క్రేజీ కామెడీ చిత్రం 'డాక్టర్‌'లోని ఆయన నటనకుగాను ఆయన ఉత్తమ కమెడియన్‌గా 'సైమా' అవార్డు అందుకున్నారు. ఇక దళపతి విజయ్‌ 'బీస్ట్‌', విజయ్‌ సేతుపతి 'కాతువాకుల రెండు కాదల్‌' తదితర సినిమాల్లోనూ నటించి మెప్పించారు. అయితే ఈ సినిమాలన్నీ తెలుగులో కూడా విడుదలకావడం వల్ల రెడిన్‌ కింగ్స్‌స్లీ ఇక్కడి వారికీ పరిచయమయ్యారు.

Redin Kingsley Movie List :1977 ఏప్రిల్ 16న జన్మించారు రెడిన్ కింగ్‌స్లీ. 1998లోనే 'అవల్ వరువాల' అనే సినిమాలో తెరపై డ్యాన్సర్​గా కనిపించారు రెడిన్. ఆ తర్వాత 2018లో కొలమావు కోకిల అనే సినిమాతో పూర్తి నటుడిగా తెరంగేట్రం చేశారు. ఆ సినిమాతో రెడిన్ సూడి తిరిగింది. 2019లో ఎల్​కేజీ, గూర్ఖా, ఏ1, జాక్​పాట్​ సినిమాలతో ఫుల్​ బిజీ అయిపోయారు. అయితే 2020లో ఆయన నటించిన సినిమాలేవీ విడుదల కాలేదు. 2021లో మూడు సినిమాల్లో నటించిన రెడిన్​ ఆ మరుసటి ఏడాది (2022)లో ఏకంగా 11 సినిమాల్లో కనిపించడం విశేషం. ఇక ఈ ఏడాది తన రికార్డును తానే బ్రేక్​ చేసి 12 సినిమాల్లో నటించారు. ప్రస్తుతం ఆయన సూర్య కంగువ, వాస్కొడి గామా అనే సినిమాల్లో నటిస్తున్నారు.

బాక్సాఫీసు ముందు 'యానిమల్' ర్యాంపేజ్​- రూ.660 కోట్లు దాటిన కలెక్షన్స్

అడవిలో నగ్నంగా బాలీవుడ్ హీరో - నన్ను నేను తెలుసుకోవడానికంటూ ట్వీట్!

Last Updated : Dec 10, 2023, 7:57 PM IST

ABOUT THE AUTHOR

...view details