ఈ ఏడాది వారిసు చిత్రంతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు తమిళ స్టార్ హీరో దళపతి విజయ్. ఇప్పుడు ఆయన నుంచి రాబోతున్న కొత్త ప్రాజెక్ట్ దళపతి 67. విక్రమ్ సినిమాతో ఇండియా వైడ్‌గా సూపర్ హిట్‌ను అందుకున్న లోకేశ్ కనగరాజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. గ్యాంగ్‌స్టర్స్ నేపథ్యంలో రూపొందనున్న ఈ చిత్రంపై ఇప్పటికే అభిమానులు భారీగా అంచనాలు పెట్టుకున్నారు. అయితే ఈ చిత్రం గురించి మరో ఆసక్తికర విషయం బయటకు వచ్చింది.
అప్పుడే ఇలా షూటింగ్ అలా ప్రారంభమైందో లేదో అంతలోనే.. ఈ సినిమా ఓటీటీ శాటిలైట్ హక్కులు భారీ ధరకు అమ్ముడు పోయాయని తెలిసింది. రూ.230కోట్లకు కొనుగోలు చేసినట్లు తెలిసింది. ఇది తమిళ చిత్రసీమలోనే ఆల్‌టైమ్ రికార్డు. ఇకపోతే ఈ చిత్రంలో సంజయ్‌దత్ విలన్‌గా నటిస్తున్నారు. హీరోయిన్గా త్రిష నటిస్తోంది. ఇంకా ఈ చిత్రంలో ప్రియా ఆనంద్, డ్యాన్స్ మాస్టర్, నటుడు శాండీ, దర్శకుడు మిస్కిన్, నటుడు మన్సూర్ అలీఖాన్‌లు, మాథ్యూ థామస్ తదితరులు ఇందులో నటిస్తున్నారు. హీరోయిన్గా త్రిష నటిస్తోంది. ఈ తారాగణంతో విజయ్ సినిమాపై అంచనాలు తారాస్థాయిని తాకాయి. దీంతో విజయ్ వర్సెస్ సంజయ్ కాంబినేషన్‌ను తెరపై చూసేందుకు విజయ్ అభిమానులతో పాటు సినీప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.