తన సినిమాలోని పాటల చిత్రీకరణ కోసం స్టార్ డైరెక్టర్ శంకర్ భారీగానే ఖర్చు చేస్తారు. భారీ హంగులతో కోట్లు వెచ్చించి మరీ షూట్ చేస్తారు. ఆయన గత చిత్రాలు చూస్తే పాటలకు ఎంతో ప్రత్యేకత ఉంటుంది. అయితే ఇప్పుడాయన మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్‌తో కలిసి సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. కియారా అద్వానీ, అంజలి ఈ చిత్రంలో హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. . అయితే, ఈ సినిమాలోనూ అద్భుతం అనిపించేలా శంకర్ సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారని సమాచారం.
పొలిటికల్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాలో ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ ఉందని.. 7 నిమిషాల నిడివి ఉండే సన్నివేశం కోసం ఏకంగా రూ.70 కోట్లు ఖర్చుచేస్తున్నారని గతంలో వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఒక పాట కోసం ఏకంగా రూ.25 కోట్లు, మరో రెండు సాంగ్స్ కోసం రూ.8కోట్లు, రూ.15కోట్లు కేటాయించారని ప్రచారం సాగింది. ఇప్పుడు మళ్లీ అలాంటి ప్రచారం మరొకటి వినిపిస్తోంది. ఈ సారి రూపొందించబోయే పాట కూడా రూ.15కోట్లు పెట్టి తీయబోతున్నారని అంటున్నారు. అయితే ఈ సారి చరణ్-అంజలి మీద షూట్ చేయబోతున్నారట. ఇందులో వీరిద్దరికీ భారీగా డ్యాన్స్ స్టెప్పులు కూడా పెట్టబోతున్నారట. మరి ఇందులో నిజమెంతో తెలియదు గానీ ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోయాయి.