తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

Ravanasura review: 'రావణాసుర'.. రవితేజకు మరో హిట్​ వచ్చినట్టేనా?

మాస్‌ మహారాజా రవితేజ నటించిన కొత్త చిత్రం 'రావణాసుర' ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. మరి ఇంతకీ ఈ సినిమా గురించి సోషల్​మీడియా రివ్యూ ఏంటంటే?

Raviteja Ravanasura review
Ravanasura review: 'రావణాసుర'.. రవితేజకు మరో హిట్​ వచ్చినట్టేనా?

By

Published : Apr 7, 2023, 8:24 AM IST

Updated : Apr 7, 2023, 8:50 AM IST

'ధమాకా', 'వాల్తేరు వీరయ్య'తో బ్యాక్​ టు బ్యాక్​ సూపర్​ హిట్​లను అందుకున్న మాస్‌ మహారాజా రవితేజ నటించిన కొత్త చిత్రం 'రావణాసుర'. సుధీర్‌ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఏకంగా ఐదుగురు హీరోయిన్లు నటించారు. మేఘా ఆకాష్‌, అను ఇమ్మాన్యుయేల్‌, ద‌క్షా న‌గార్క‌ర్‌, ఫ‌రియా అబ్దుల్లా, పూజిత పొన్నాడ హీరోయిన్లుగా న‌టించారు. యంగ్‌ హీరో సుశాంత్‌ కీలక పాత్రలో కనిపించి ఆకట్టుకున్నారు. ఇప్పుటికే విడుదలైన ట్రైలర్‌, సాంగ్స్​.. సినిమాపై అంచనాలను పెంచాయి. అభిషేక్ పిక్చ‌ర్స్, ఆర్‌టీ టీమ్ వ‌ర్క్స్ బ్యాన‌ర్‌పై అభిషేక్ నామా నిర్మించిన ఈ చిత్రం.. భారీ అంచనాలతో నేడు(ఏప్రిల్‌ 7) ఆడియెన్స్​ ముందుకు వచ్చింది. ఈ సినిమా చూసేందుకు ప్రేక్షకులు కూడా థియేటర్లకు భారీగానే తరలివచ్చారు. వాళ్లందరూ సినిమా చూసిన తర్వాత సోషల్‌ మీడియా ద్వారా తమ అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తున్నారు. మరి 'రావణాసుర' కథేంటి? అడియెన్స్ ఏమంటున్నారు? రవితేజ మరో హిట్​ అందుకున్నట్టేనా? తెలుసుకుందాం..

'రావణాసుర పూర్తి మసాల థ్రిల్లర్‌ సినిమా. రవితేజ ఫ్యాన్స్‌తో పాటు మాములు ప్రేక్షకులకు కూడా నచ్చుతుంది. రవితేజను ఇంతకుముందు ఎప్పుడు చూడని రోల్​లో చూస్తాం. కథ, ఇంటర్వెల్‌ సన్నివేశం, బ్యాక్​గ్రౌండ్ మ్యూజిక్‌ బాగుంది' అని ఓ అభిమాని చెప్పుకొచ్చాడు. 'అన్నా దయచేసి మళ్లీ ఇలాంటి సినిమాలు తీయొద్దు. నిప్పు, ఖిలాడీ కలిపి తీసినట్టుంది. ఖిలాడీనే కాస్త బెటర్. నీ సినిమాలు ఫ్లాప్​ అవ్వకూడదని భావిస్తాం. కానీ నువ్వు డిజాస్టర్ సినిమాలు తీస్తావ్' అని ఓ అభిమాని ఆవేదన వ్యక్తం చేశాడు. 'సినిమా అదిరిపోయింది.. నెగటివ్ షేడ్స్​లో రవితేజ అదరగొట్టేశారు.. వన్ మెన్ షో', 'ఈ సినిమాలో తెలంగాణ స్లాంగ్ వింటుంటే చెవుల నుంచి రక్తాలు వస్తున్నాయ్. అసలు ఈ తెలుగు సినిమాల్లో యాసను వినియోగించడం బ్యాన్ చేయాలి.' క్రైమ్ సీక్వెన్స్‌లు ఓకే.. ఇంటర్వెల్ సీన్ అద్భుతం.. పూర్తిగా కొత్త పాత్రలో రవితేజ కనిపించారు.. అద్భుతంగా నటించారు' అని యూజర్స్ కామెంట్స్​ చేస్తున్నారు.

లాయ‌ర్ క్రిమిన‌ల్‌గా మారితే.. ఈ చిత్రంలో ర‌వితేజ క్రిమిన‌ల్ లాయ‌ర్​గా క‌నిపిస్తారని అంటున్నారు. అయితే అనుకోని కొన్ని కార‌ణాల వ‌ల్ల.. ఆ న్యాయవాది క్రిమిన‌ల్‌గా ఎలా మారాడ‌నే పాయింట్‌తో ద‌ర్శ‌కుడు సుధీర్‌ వ‌ర్మ కథను తెర‌కెక్కించారని చెబుతున్నారు. ఈ క్రిమినల్​ రోల్​లో నెగెటివ్ షేడ్స్‌తో ర‌వితేజ సూపర్​గా చేశారని కూడా ఆడియెన్స్​ అంటున్నారు. ఫ‌స్ట్ హాఫ్ స్టోరీ స్లోగా సాగుతుందని.. కేవలం ర‌వితేజ కామెడీ, హీరోయిన్ల రొమాంటిక్ ట్రాక్‌తో సాగుతుందని చెబుతున్నారు. ఇంట‌ర్వెల్ ట్విస్ట్ సినిమాకు హైలైట్‌గా ఉంటుందట. సెకండాఫ్ ట్విస్ట్​లతో నడుస్తూ ఆకట్టుకుందట. హీరోయిన్ల పాత్రకు స్కోప్​ లేదని, కేవలం రొమాంటిక్​ సీన్స్, సాంగ్స్​కు పరిమితమయ్యారని అంటున్నరు. బీజేఎమ్​ బాగుందట. మొత్తంగా ర‌వితేజ ఫ్యాన్స్‌ను సినిమా బాగుంటుందని టాక్​ వినిపిస్తోంది.

ఇదీ చూడండి:పది రూపాయలు కూడా లేవు.. బ్యాంక్​ బ్యాలెన్స్​ జీరో: 'బలగం' అల్లుడు ఎమోషనల్​

Last Updated : Apr 7, 2023, 8:50 AM IST

ABOUT THE AUTHOR

...view details