Raviteja Harish Shankar Movie : 'ఈగల్' సినిమా షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్న టాలీవుడ్ స్టార్ హీరో రవితేజ తాజాగా తన ఫ్యాన్స్‌కు ఓ స్వీట్ సర్ప్రైజ్ ఇచ్చారు. ఆయన అప్కమిందగ్ మూవీకి సంబంధించిన షేర్ చేశారు. హరీశ్ శంకర్ డైరెక్షన్లో తెరకెక్కనున్న ఓ సినిమాకు ఆయన సైన్ చేశారు. ఈ విషయాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో పాటు డైరెక్టర్ హరీశ్ శంకర్ అనౌన్స్ చేశారు.
ఓ స్పెషల్ పోస్టర్‌తో ఈ విషయాన్ని తెలియా చేశారు. దీంతో ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. అయితే ఈ ఇద్దరి కాంబోలో ఇది మూడవ సినిమా. ఇప్పటికే ఈ ఇద్దరూ 'షాక్', 'మిరపకాయ' లాంటి సినిమాలకు కలిసి పని చేశారు. అందులో షాక్ మిక్స్డ్ టాక్ అందుకోగా, 'మిరపకాయ' మాత్రం సూపర్ హిట్ టాక్ అందుకుని బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్లింది. అంతే కాకుండా రవితేజకు మంచి బ్రేక్ ఇచ్చింది.
మరోవైపు హరీశ్ శంకర్ డైరెక్షన్లో తెరకెక్కుతునున్న మరో మూవీ 'ఉస్తాద్ భగత్ సింగ్'. పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ ఈ సినిమాలో లీడ్ రోల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. అయితే ఇంతలోనే ఈ మూవీ అనౌన్స్ చేయడం వల్ల ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ఉస్తాద్‌కు సంబంధించి ప్రస్తుతం ఒక షెడ్యూల్ మాత్రమే పూర్తైంది. కొన్ని కారణాల వల్ల ప్రస్తతానికి బ్రేక్ పడింది. అయితే ఇప్పట్లో ఉస్తాద్ షూటింగ్ జరిగేలా లేనందున రవితేజ మూవీని పట్టాలెక్కిస్తున్నారా అంటూ ఫ్యాన్స్ నెట్టింట ఆరా తీయడం మొదలెట్టారు.