తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'మాట నిలబెట్టుకోండి' - సోలో డేట్ కోసం 'ఈగల్' టీమ్ రిక్వెస్ట్! - రవితేజ ఈగల్ రిలీజ్ డేట్

Raviteja Eagle Release Date : 'ఈగల్' మూవీ రిలీజ్​ డేట్​ విషయంలో తాజాగా ఆ చిత్ర నిర్మాణ సంస్థ ఫిల్మ్​ ఛాంబర్​కు ఓ లేఖ రాసింది. ఇంతకీ ఏం జరిగిందంటే ?

Raviteja Eagle Release Date
Raviteja Eagle Release Date

By ETV Bharat Telugu Team

Published : Jan 19, 2024, 12:47 PM IST

Updated : Jan 19, 2024, 1:50 PM IST

Raviteja Eagle Release Date :మాస్ మహారాజరవితేజ లీడ్​ రోల్​లో నటించిన 'ఈగల్‌' రిలీజ్ డేట్ విషయంలో ఆ మూవీ నిర్మాణ సంస్థ తాజాగా ఫిల్మ్ ఛాంబర్‌ను ఆశ్రయించింది. జనవరి 13న విడుదల కావాల్సిన ఈ సినిమాను ఛాంబర్ పెద్దల నిర్ణయం మేరకు సంక్రాంతి బరి నుంచి తప్పుకుంది. దీంతో ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. అయితే ఇప్పుడు అదే తేదీన దీంతో పాటు మరికొన్ని సినిమాలు రిలీజ్​ కానున్నాయి. ఈ నేపథ్యంలో సోలో రిలీజ్ డేట్‌ ఇస్తామన్న మాట నిలబెట్టుకోవాలంటూ ఫిల్మ్​ ఛాంబర్‌ను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ కోరింది. సోలో విడుదలకు సహకరించాలంటూ ఓ లేఖను విడుదల చేసింది.

'ఈగల్​'కు ఆ రెండు సినిమాల పోటీ
February Release Tollywood Movies :ఇప్పటికే ఫిబ్రవరి 8న 'యాత్ర 2' సినిమా రిలీజ్​కు సిద్ధంగా ఉంది. ఆ తర్వాతి రోజు సందీప్​ కిషన్​ 'ఊరి పేరు భైరవకోన' సినిమా థియేటర్లలోకి రానుంది. దీంతో పాట సూపర్ స్టార్ రజనీకాంత్​ 'లాల్​ సలామ్'​ మూవీ కూడా అదే డేట్​ను లాక్ చేసుకుంది.

Eagle Movie Cast : ఇక 'ఈగల్‌' సినిమా విషయానికొస్తే - వినూత్నమైన యాక్షన్‌ థ్రిల్లర్​గా రూపొందిన ఈ సినిమాకు కార్తిక్‌ ఘట్టమనేని డైరెక్టర్​గా వ్యవహరించారు. రవితేజ సరసన అనుపమ పరమేశ్వరన్‌, కావ్యా థాపర్‌ నటించగా, నవదీప్‌, మధుబాల తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. తాజాగా విడుదలైన ట్రైలర్‌, మూవీ పోస్టర్స్​ ప్రేక్షకుల్లో ఆసక్తితో పాటు సినిమాపై మరింత అంచనాలు పెంచేసింది. విధ్వంసాన్ని ఆపే వినాశనాన్ని నేను','విషం మింగుతాను, విశ్వం తిరుగుతాను', 'మార్గశిరం మధ్య రాత్రి మొండి మోతుబరి మారణ హోమం', 'తుపాకీ నుంచి బుల్లెట్ ఆగేది, అది పట్టుకున్న వాడిని తాకినప్పుడు', 'ఆయుధంతో విధ్వంసం చేసే వాడు రాక్షసుడు. ఆయుధంతో విధ్వంసం ఆపేవాడు దేవుడు. ఈ దేవుడు మంచోడు కాదు మొండోడు' డైలాగ్స్​తో ఇంట్రెస్టింగ్​గా సాగింది ట్రైలర్. చూస్తుంటే ఇందులో రవితేజ డిఫరెంట్ షేడ్స్​ ఉన్న పాత్రలో కనిపించి ఆకట్టుకోనున్నట్లు తెలుస్తోంది.

రవితేజ 'ఈగల్' ట్రైలర్ ఔట్- విషం మింగే విధ్వంసకారుడిగా మాస్ మహారాజా

ఆచితూచి అడుగులేయనున్న మాస్​ మహారాజ 'ఈగల్'​కు ఇది అసలు పరీక్ష!

Last Updated : Jan 19, 2024, 1:50 PM IST

ABOUT THE AUTHOR

...view details