తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

దీపావళి రేసు నుంచి రవితేజ 'ధమాకా' ఔట్.. శ్రీనువైట్లతో గోపీచంద్ కొత్త మూవీ! - ధమాకా మూవీ

హీరో రవితేజ నటించిన 'ధమాకా' చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్​ పనులు జరుపుకుంటుంది. అయితే దీపావళి కానుకగా ఈ సినిమాను మేకర్స్​ రిలీజ్​ చేద్దామని మొదట అనుకున్నా.. ఇప్పుడు నిర్ణయం మార్చుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు, హీరో గోపీచంద్.. డైరెక్టర్​ శ్రీను వైట్లతో సినిమా చేయబోతున్నారని సమాచారం.

raviteja dhamaka release date and gopichand next movie
raviteja dhamaka release date and gopichand next movie

By

Published : Oct 4, 2022, 12:47 PM IST

Dhamaka Movie Release Date: మాస్‌రాజా రవితేజ ఫలితంతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలను సెట్స్‌ పైకి తీసుకెళ్తున్నారు. చాలా కాలం త‌ర్వాత 'క్రాక్‌'తో మంచి కంబ్యాక్ ఇచ్చారు. పాండ‌మిక్‌లో విడుద‌లైన ఈ చిత్రం భారీ వ‌సూళ్ళ‌ను రాబ‌ట్టి బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఘ‌న విజయం సాధించింది. ఇక అదే స్పీడ్‌లో 'ఖిలాడీ', 'రామారావు ఆన్ డ్యూటీ' చిత్రాల‌ను ఐదు నెల‌ల గ్యాప్‌లోనే విడుద‌ల చేశారు. అయితే ఈ రెండు సినిమా ఫ‌లితాలు ర‌వితేజ‌ను తీవ్రంగా నిరాశ‌ప‌రిచాయి. ప్ర‌స్తుతం ఈయ‌న‌ ఆశ‌ల‌న్నీ 'ధ‌మాకా' సినిమాపైనే ఉన్నాయి. ఇప్ప‌టికే చిత్రం నుంచి విడుద‌లైన పోస్ట‌ర్‌లు, పాటలు ప్రేక్ష‌కుల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకున్నాయి.

షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్ల పనులను జరుపుకుంటుంది. కాగా ఈ సినిమా విడుదల విషయంలో మాత్రం మేకర్స్‌ ఎలాంటి అప్‌డేట్‌లు ఇవ్వడంలేదు. ముందు నుంచి ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా విడుదల చేయాలని ప్లాన్‌ వేశారు. కానీ, రిలీజ్‌ డేట్‌పై ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వలేదు. అయితే రవితేజ బ్యాక్‌ టూ బ్యాక్‌ సినిమాలు చేయడం.. అవి కాస్త ఫ్లాప్‌లుగా మారడంతో ఈ మూవీ గురించి ఎలాంటి ప్రకటన లేదు. ఈ క్రమంలో చిత్రబృందం భారీగా ప్రమోషన్లు జరిపి సినిమాపై మంచి బజ్‌ తీసుకురావాలని భావిస్తున్నారట. ఈ క్రమంలోనే దీపావళి రేసు నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది.

Gopichandh Next Movie: యాక్షన్ హీరో గోపీచంద్‌ చాలా కాలం తర్వాత 'సీటీమార్‌'తో హిట్‌ ట్రాక్‌లోకి వచ్చారు. అయితే ఈ చిత్రం కమర్షియల్‌గా భారీ విజయం సాధించలేకపోయింది. ఆ తర్వాత 'పక్కా కమర్షియల్‌' వంటి ఫ్యామిలీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చినా.. ఆయనకు కమర్షియల్‌ బ్రేక్‌ ఇవ్వలేదు. అందుకే ఇప్పుడు గోపీచంద్‌కు సక్సెస్‌ చాలా అవసరం. ప్రస్తుతం ఆయన శ్రీవాస్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. గతంలో వీరిద్దరి కాంబోలో తెరకెక్కిన 'లక్ష్యం', 'లౌక్యం' చిత్రాలు బ్లాక్‌బస్టర్‌లుగా నిలిచాయి.

ఇదిలా ఉంటే గోపిచంద్‌ తాజాగా శ్రీనువైట్లతో సినిమా చేయడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇటీవలే శ్రీనువైట్ల ఓ యాక్షన్‌ థ్రిల్లర్‌ కథను గోపీచంద్‌కు చెప్పారట. కథ నచ్చడంతో గోపీచంద్‌ కూడా వెంటనే గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారట. ఇందులో నిజమెంతుందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

ఇవీ చదవండి:బ్లాక్​ డ్రెస్​లో ఆలియా బేబీ బంప్​​ ఫొటోషూట్​.. ధర తెలిస్తే షాకే!

ధనుశ్​-శేఖర్​ కమ్ముల ప్రాజెక్ట్​.. స్క్రిప్ట్​ వర్క్​ కంప్లీట్​.. సెట్స్​పైకి అప్పుడే!

ABOUT THE AUTHOR

...view details