తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

Ravi Teja Silpa shetty : మాస్ మహారాజాతో శిల్పాశెట్టి డ్యాన్స్​.. స్టెప్పులు అదిరిపోయాయి బాసూ! - రవితేజ శిల్పాశెట్టి డ్యాన్స్ వీడియో

Ravi Teja Silpa shetty Dance Video : మాస్ మహారాజా రవితేజ.. బాలీవుడ్ భామ శిల్పాశెట్టితో కలిసి స్టేజ్​పై చిందులేశారు. ఆ వీడియో తెగ వైరల్ అవుతోంది.

Ravi Teja Silpa shetty : మాస్ మహారాజాతో శిల్పాశెట్టి డ్యాన్స్​.. స్టెప్పులు అదిరిపోయాయి బాసూ!
Ravi Teja Silpa shetty : మాస్ మహారాజాతో శిల్పాశెట్టి డ్యాన్స్​.. స్టెప్పులు అదిరిపోయాయి బాసూ!

By ETV Bharat Telugu Team

Published : Oct 10, 2023, 9:54 PM IST

Ravi Teja Silpa shetty Dance Video :మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం 'టైగర్ నాగేశ్వర రావు' ప్రమోషన్స్​లో ఫుల్​ బిజీగా గడుపుతున్నారు. ఈ చిత్రంతో తొలి సారి హిందీలోకి అడుగుపెట్టనున్నారు. అందుకే సినిమాను ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లడానికి దొరికిన ప్రతి అవకాశాన్ని రవితేజ అస్సలు వదలట్లేదు. ఈ క్రమంలోనే బాలీవుడ్​లోనూ గట్టిగా ప్రమోషన్లు చేస్తున్నారాయన. ఈవెంట్లు, ఇంటర్వ్యూలు, రియాలిటీ షోలు దేనిని వదలట్లేదు.

అలా తాజాగా రవితేజ ఓ రియాలిటీ డ్యాన్స్ ఈవెంట్​లో పాల్గొన్నారు. ఆ షోకు బాలీవుడ్ అందాల భామ శిల్పా శెట్టి జడ్జిగా వ్యవహరిస్తోంది. అక్కడ ఆమెతో కలిసి రవితేజ స్టేజ్​పై చిందులేశారు. 'ఏక్ దమ్ సాంగ్'​కు.. ఇద్దరు కలిసి కాలు కదిపారు. స్టైలిష్ లుక్​లో రవితేజ.. ఎల్లో కలర్​ శారీలో శిల్పా శెట్టి.. తమ స్టెప్పులతో సందడి చేశారు. ప్రేక్షకుల్లో సరికొత్త జోష్ నింపారు. ఈ వీడియోను శిల్పాశెట్టి షేర్ చేస్తూ.. 'హమ్ తో ఏక్ దమ్ ఫిదా హైన్. ఔర్ ఆప్' అంటూ ఓ క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అభిమానులు ఈ వీడియోను తెగ షేర్ చేస్తూ విపరీతంగా కామెంట్లు పెడుతున్నారు.

Tiger Nageswarrao Release Date : కాగా, టైగర్ నాగేశ్వరరావు సినిమా అక్టోబర్​ 20న విడుదలకు రెడీ అవుతోంది. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్​ కానుంది. వంశీ దర్శకత్వం వహించారు. 1970లో స్టువర్ట్ పురం గజదొంగగా పేరున్న టైగర్ నాగేశ్వరావు జీవితం ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. అనుపమ్ ఖేర్, జిషు సేన్‌గుప్తా, రేణు దేశాయ్ ఇతర కీలక పాత్రలు పోషించారు. నూపుర్ సనన్ హీరోయిన్​గా నటించింది. జి.వి.ప్రకాష్‌ కుమార్‌ సంగీతం అందించారు. ఆర్‌.మది ఛాయాగ్రాహకుడిగా వ్యవహరించారు. అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌ బ్యానర్​పై సినిమా రూపొందింది. రీసెంట్​గా రిలీజైన ఈ మూవీ ట్రైలర్ కూడా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. చూడాలి మరి ఈ సినిమా ఎంత వరకు ఆకట్టుకుంటుందో..

Bigg Boss Show : 3 రోజులు రూ.2 కోట్లు.. హైయెస్ట్​​ రెమ్యునరేషన్​ తీసుకున్న కంటెస్టెంట్​ తెలుసా?

ODI World Cup 2023 : భారత్ - ఆసీస్​ మ్యాచ్​లో 'టైగర్​ నాగేశ్వరరావు'.. కోహ్లీ సూపర్​ క్యాచ్​పై కామెంట్స్​.. వీడియో చూశారా?

ABOUT THE AUTHOR

...view details