Ravi Teja Rashmika Mandanna Movie : రవితేజ - రష్మిక మందన్నా కలిసి నటించనున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. రవితేజ - దర్శకుడు గోపీచంద్ మలినేనిది బ్లాక్ బస్టర్ హిట్ కాంబినేషన్ అన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వీరి కాంబోలో హ్యాట్రిక్ హిట్స్ వచ్చాయి. 'డాన్ శీను'తో మొదలైన వీరి జర్నీ.. ఆ తర్వాత 'బలుపు', 'క్రాక్' సినిమాలతో ఆడియెన్స్ ముందుకు వచ్చి బాక్సాఫీస్ ముందు సూపర్ హిట్‌ను అందుకున్నాయి.
Ravi Teja Gopichand Malineni Movie : అయితే ఇప్పుడీ కాంబో నాలుగో సారి సినిమా చేసేందుకు రెడీ అయిన సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో వీరి సినిమా రాబోతుంది. నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ చిత్రంలో మొదటి నుంచి హీరోయిన్గా శ్రీలీల పేరు వినిపించింది. కానీ ఇప్పుడు లేటెస్ట్గా రష్మిక మందన్నా పేరు పైకి వచ్చింది. ఇటీవలే ఈ మూవీ మేకర్స్ రష్మికతో చర్చలు జరపగా ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలిసింది. ఒకవేళ ఇదే కనుక నిజమైతే రవితేజ - రష్మిక కాంబోలో రానున్న తొలి చిత్రం ఇదే అవుతుంది.