Ravi teja Mr Bachchan: మాస్ మహారాజ రవితేజ- హరిశ్ శంకర్ కాంబోలో తెరకెక్కునున్న మూడో సినిమా టైటిల్ ఫిక్స్ అయ్యింది. ఆదివారం మూవీమేకర్స్ టైటిల్‌తోపాటు ఫస్ట్ లుక్‌ను కూడా రిలీజ్ చేశారు. ఈ సినిమాకు ఈ సినిమాకు 'మిస్టర్ బచ్చన్' అని టైటిల్ ఖరారు చేశారు. 'నామ్ తో సునా హోగా' అనేది ట్యాగ్ లైన్. ఈ టైటిల్ పోస్టర్ రవితేజ అభిమానులను బాగా ఆకట్టుకుంటోంది.
అయితే హీరో రవితేజ, ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను అమితాబ్ బచ్చన్‌కు ట్యాగ్ చేస్తూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. తన ఫేవరేట్ హీరో అమితాబ్ బచ్చన్ పేరుతో ఒక పాత్ర చేయటం తనకు దక్కిన గౌరవం అని ట్విట్టర్లో రాసుకొచ్చారు. అయితే అమితాబ్ బచ్చన్‌కు, తను వీరాభిమాని అనే విషయాన్ని స్వయంగా ఆయనే పలు సందర్భాల్లో తెలియజేశారు.
Mr bachchan First look : టైటిల్ పోస్టర్లో స్కూటర్‌పై కూర్చొని సీరియస్‌గా చూస్తున్న రవితేజ లుక్ అదిరిపోయింది. అలానే మీసం, హెయిర్ కట్ చూస్తుంటే 70,80ల్లో అమితాబ్ బచ్చన్‌ను గుర్తు చేస్తున్నాయి. బ్యాక్‌గ్రౌండ్‌లో అమితాబ్ బచ్చన్ షాడోను పెట్టారు. వెనకాల నటరాజ్ అనే సినిమా థియేటర్, దాని ముందు జనం కనిపిస్తున్నారు. అంతేకాకుండా అమితాబ్ సినిమాలోని డైలాగ్‌ను ట్యాగ్‌లైన్‌గా పెట్టారు. మొత్తంగా ఈ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌కు విశేష స్పందన లభిస్తోంది.