ఓ వైపు హరీశ్- పవన్ కాంబోలో రావాల్సిన 'ఉస్తాద్ భగత్ సింగ్' ఇంకా సెట్స్‌లోకి అడుగుపెట్టకముందే మరో క్రేజీ ప్రోజెక్ట్ గురించి అప్డేట్ ఇచ్చేశారు దర్శకుడు హరీశ్ శంకర్. అప్పుడెప్పుడో పవన్ కల్యాణ్‌తో 'ఉస్తాద్' సినిమాకు సైన్ చేసిన ఈ స్టార్ డైరెక్టర్ ఆ తర్వాత ఇప్పటివరకు ఎటువంటి అప్డేట్ ఇవ్వలేదు. అయితే తాజాగా ఓ వీడియోను షేర్ చేస్తూ ఫ్యాన్స్‌కు డబుల్ బొనాంజ ఇచ్చారు. 'ఉస్తాద్' సినిమా సెట్స్‌పైకి వెళ్లబోతున్నట్లు తెలిపి అభిమానుల్లో జోష్ నింపారు. దీంతో పాటే మాస్ మహారాజ రవితేజతో ఓ సినిమా తీయనున్నట్లు కూడా చెప్పారు.
మాస్ మహారాజతో పీరియాడికల్ డ్రామా..
ప్రస్తుతం రావణాసుర చిత్ర ప్రమోషన్లలో ఫుల్ బిజీగా ఉన్న మాస్ మహారాజా రవితేజ.. అభిమానులతో ట్విటర్ వేదికగా మచ్చటించారు. ఇందులో భాగంగా నిర్వహించిన 'క్యూ అండ్ ఏ'లో అభిమానుల ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. ఈ క్రమంలోనే ఓ అభిమాని హరీశ్ శంకర్‌తో మళ్లీ మూవీ ఎప్పుడు చేస్తారు అని అడిగాడు. ఇదే ప్రశ్నకు హరీశ్ శంకర్‌ను ట్యాగ్ చేస్తూ రవితేజ కూడా అదే ప్రశ్నను అడిగారు. "ఏమ్మా హరీష్ శంకర్ ఏదో అడుగుతున్నారు నిన్నే.." అంటూ తనదైన శైలిలో ట్విటర్ వేదికగా దర్శకుడిని అడిగారు.