Ratan Tata Biopic Movie : 'ఆకాశం నీ హద్దురా' చిత్రంతో జాతీయ స్థాయిలో మెరిశారు దర్శకురాలు సుధ కొంగర. ఇప్పుడామె ఇదే సినిమాని హిందీలో అక్షయ్ కుమార్‌తో రీమేక్ చేస్తున్నారు. ఇది పూర్తయిన వెంటనే ఆమె ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్ టాటా జీవిత కథను తెరపైకి తీసుకురానున్నారని సమాచారం. ప్రస్తుతం ఈ కథకు సంబంధించిన పరిశోధనలు కీలక దశలో ఉన్నాయని, వచ్చే ఏడాది అక్టోబరులో సినిమా కార్యరూపం దాల్చనుందని వార్తలు వినిపిస్తున్నాయి.
తెరపైకి రతన్ టాటా జీవితం.. సుధ కొంగర దర్శకత్వంలో.. - sudha kongara ratan tata movie
Ratan Tata Biopic Movie : ప్రముఖ వ్యాపారవేత్త రతన్ టాటా జీవిత కథ తెరపైకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను దర్శకురాలు సుధ కొందర తెరకెక్కించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
రతన్ టాటా బయోపిక్
ఇప్పటికే స్క్రిప్ట్ పనులు మొదలైనట్లు తెలుస్తోంది. ఇందులో సూర్య, అభిషేక్ బచ్చన్ ప్రధాన పాత్రలు పోషించనున్నట్లు ప్రచారం సాగుతోంది. ఎందుకంటే సూర్యతో ఓ బయోపిక్ తెరకెక్కించనున్నట్లు ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో స్పష్టత ఇచ్చారు సుధ. అలాగే కేజీఎఫ్ చిత్ర నిర్మాతలతో వాస్తవ సంఘటనల ఆధారంగా ఓ సినిమా చేయనున్నట్లు గతంలోనే ప్రకటించారు. ఇవన్నీ టాటా జీవిత కథకు బలం చేకూర్చుతున్నాయి.