Rashmika Marriage : హీరోయిన్ల పెళ్లి గురించి నిత్యం రకరకాల వార్తలు, రూమర్స్ మనం వింటూ ఉంటాం. ముఖ్యంగా స్టార్ హీరోయిన్ల పెళ్లికు సంబంధించి రూమర్స్ అయితే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఉంటాయి. ఈ వార్తలపై కొంతమంది నటీమణులు స్పందిస్తూ.. వాటిని ఖండిస్తూ ఉంటారు. మరికొంతమంది వాటిని అస్సలు పట్టించుకోరు. కానీ నేషనల్ క్రష్ రష్మిక.. మాత్రం తనకు ఏకంగా పెళ్లి అయిపోయిందని చెప్పి షాక్ ఇచ్చింది.
కొన్నిరోజుల ముందు ఓ ప్రమోషనల్ ఈవెంట్‌కు బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్‌తో కలిసి వెళ్లింది. ఆ సమయంలో యాంకర్ ప్రశ్న అడగ్గా.. 'నాకు నరుటోతో ఆల్రెడీ పెళ్లయిపోయింది. నా మనసులో అతడే ఉన్నాడు' అని రష్మిక ఫన్నీ కామెంట్స్ చేసింది. 'నరుటో' అనేది ఫేమస్ అయిన ఎనిమీ సిరీస్‌లో ఓ పాత్ర పేరు. వీటికి ప్రత్యేకంగా చాలా మంది అభిమానులు ఉంటారు. అందులో రష్మిక ఒకరు.
Rashmika Career : కన్నడ సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ భామ తెలుగులో ఛలో సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాతోనే విజయం అందుకుంది. ఆ తర్వాత వరుస సినిమాలతో దుసుకుపోతోంది ఈ చిన్నది. తెలుగులో స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమాతో పాన్ ఇండియా మూవీ హీరోయిన్గా మారిపోయింది. ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్లో బిజీగా ఉంది.
Rashmika Upcoming Movies : ప్రస్తుతం 'పుష్ప 2' సినిమాతో బిజీగా ఉన్న రష్మిక.. దీనితోపాటు సందీప్ రెడ్డి వంగా 'యానిమల్'తోపాటు 'రెయిన్ బో' అనే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ కూడా చేస్తోంది. తెలుగులో నితిన్‌తోనూ ఓ సినిమా చేస్తోంది. అయితే ఇందులో నుంచి ఆమె తప్పుకుందనే రూమర్స్ వచ్చాయి గానీ ఈ విషయమై క్లారిటీ రావాల్సి ఉంది.
Rashmika Marriage Update : ఇదిలా ఉంటే ఈ అమ్మడికి గతంలో ఎంగేజ్‌మెంట్ అయింది. కన్నడ హీరో రక్షిత్ శెట్టి తో రష్మిక ఎంగేజ్‌మెంట్ జరిగింది. కానీ అది పెక్కి పీటల వరకు వెళ్లలేదు. ప్రస్తుతం ఆమె టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండతో రిలేషన్లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.