టీమ్ఇండియా క్రికెటర్ శుభ్‌మన్ గిల్.. ఇటీవలే టాలీవుడ్ భామ రష్మిక మందన్నపై క్రష్(లవ్) ఉందంటూ స్పష్టం చేశాడు. ఇప్పుడు ఇదే విషయాన్ని హీరోయిన్ రష్మికను అడగ్గా.. చిరునవ్వుతో సమాధానం ఇచ్చింది. చేత్తో హార్ట్ సింబల్‌ను చూపించింది. దీంతో శుభ్‌మన్, రష్మికల మధ్య ఏదో ఉందన్న గాసిప్స్‌కు మరింత బలం చేకూరింది. ఈ ప్రశ్నను ఆమె తిరస్కరించకుండా నవ్వడం వల్ల.. ఈ మొత్తం వ్యవహారం గురించి రష్మికకు అవగాహన ఉందన్న విషయం అర్థమవుతోంది.
ఇటీవల రష్మిక హైదరాబాద్‌లో ఓ కార్యక్రమంలో మెరిసింది. ఈ ఈవెంట్లో ఆమెను విలేకరులు రష్మికపై శుభ్‌మన్ చేసిన కామెంట్స్‌ను ప్రస్తావించారు. ఇందుకు స్పందించిన ఆమె చిరునవ్వుతో కూల్‌గా సమాధానం ఇచ్చింది. అంతేగాక తన రెండు చేతులతో హార్ట్(గుండె)సింబల్‌ను చూపించింది. దీంతో ఆమె ఫ్యాన్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమాధానంతో తనక్కూడా(రష్మిక) శుభ్‌మన్ అంటే ఇష్టమనే విషయం అర్థమవుతోందని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
ఏంటీ రష్మిక, శుభ్మన్ల కహానీ?
ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో శుభ్‌మన్ గిల్ తన క్రష్ ఎవరని అడిగిన ప్రశ్నకు.. టాలీవుడ్ నటి రష్మిక మందన్న అని చెప్పకనే చెప్పేశాడంటూ నెట్టింట్లో వార్తలు హల్ చల్ చేశాయి. 'మీకు ఇష్టమైన బాలీవుడ్ హీరోయిన్ ఎవరు..?' అంటూ ఓ ఇంటర్వ్యూలో యాంకర్ శుభ్‌మన్ ప్రశ్న అడిగారు. ఇందుకు సమాధానంగా రష్మిక మందన్న అంటూ గిల్ ఆన్సర్ ఇచ్చాడట. అయితే రష్మిక కంటే ముందు శుభ్‌మన్‌కు నటి సారా అలీఖాన్, సచిన్ తెందూల్కర్ కుమార్తె సారా తెందూల్కర్ల మధ్య ఏదో నడుస్తోందనే గాసిప్స్ కూడా తెగ వైరల్ అయ్యాయి. దీంతో ఈ ప్రోగ్రాంలో గిల్ వీరిద్దరి పేరే చెప్తాడనుకుంటే.. సడెన్‌గా రష్మిక పేరు చెప్పడంతో అభిమానులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. కాగా, వీరిద్దరి పేర్లు సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి. దీనిపై స్పందించిన గిల్.. అసలు తాను ఈ విషయాన్ని ఎక్కడ ప్రస్తావించానో తెలియడం లేదంటూ రిప్లై ఇచ్చాడు. దీంతో అందరూ మళ్లీ కన్య్ఫూజన్‌లో పడ్డారు. తాజాగా ఈ గాసిప్స్‌ను శుభ్‌మన్ గిల్ కొట్టిపారేశారు. ఈ క్రమంలోనే రష్మిక నవ్వుతూ.. హార్ట్ సింబల్ చూపించడంతో కథ మొదటికి వచ్చినట్లయింది.