తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

Rashmika Mandanna New Movie : మరో సినిమాకు రష్మిక గ్రీన్​ సిగ్నల్​.. వీడియో రిలీజ్.. ఎవరికి 'గర్ల్​ఫ్రెండ్'​ కానుందో ? - రష్మిక మందన్న అప్​కమింగ్ మూవీస్​

Rashmika Mandanna New Movie : ఇటీవలే బాలీవుడ్​లోకి ఎంట్రీ వరుస సినిమాలతో బిజీగా ఉన్న నేషనల్​ క్రష్ రష్మిక మందన్న తాజాగా టాలీవుడ్​లో మరో సినిమాకు సైన్​ చేసింది. ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్​ బ్యానర్​పై తెరకెక్కుతున్న ఈ సినిమా గురించి మరిన్ని విశేషాలు మీ కోసం..

Rashmika Mandanna New Movie
Rashmika Mandanna New Movie

By ETV Bharat Telugu Team

Published : Oct 22, 2023, 12:22 PM IST

Updated : Oct 22, 2023, 2:19 PM IST

Rashmika Mandanna New Movie : నేషనల్​ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఇటీవలే బాలీవుడ్​లోకి ఎంట్రీ ఇచ్చి వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ చిన్నది..తాజాగా తెలుగులో మరో సినిమాకు సైన్​ చేసింది. ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్​ ప్రొడక్షన్​ నెం.51గా తెరకెక్కిస్తున్న 'ద గర్ల్​ఫ్రెండ్'​ అనే చిత్రంలో ఆమె లీడ్​ రోల్​లో నటించనుంది. నటుడు కమ్​ దర్శకుడు రాహుల్​ రవీంద్ర ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. 'ఖుషి' ఫేమ్​ హేషమ్​ అబ్దుల్​ వహమ్​ ఈ మూవీకి సంగీతాన్ని అందిస్తున్నారు.

The Girlfriend Movie Glimpse : గ్లింప్స్​లో రష్మిక ఓ కొత్త లుక్​లో కనిపించింది. ఓ వ్యక్తి చెప్పే డైలాగ్​తో మొదలయ్యే గ్లింప్స్​ మూవీ లవర్స్​లో ఉత్కంఠ రేపుతోంది. ప్రాణం కంటే ఎక్కువగా తనను ప్రేమిస్తుందనుకునే ఓ కుర్రాడు.. అతడ్ని ప్రేమించడానికి సర్వం కోల్పోయానుకుంటూ లోలోపల భరించలేని బాధను అనుభవించే ఓ అమ్మాయి. వీరిద్దరి ప్రేమ గాధ ఏలా ఉంటుందన్న కాన్సెప్ట్‌తో ఈ సినిమా రూపొందుతున్నట్లు గ్లింప్స్‌ చూస్తే అర్థమౌతోంది. మరోవైపు ఇదొక ట్రాజిక్‌ లవ్‌ స్టోరీ అని, ఆ కుర్రాడు కూడా ఓ సైకో షేడ్స్​ ఉన్న మనిషి అని గ్లింప్స్ ద్వారా తెలుస్తోంది. మొత్తానికి రష్మిక ఈ సినిమాతో మరో కొత్త జానర్​ను టచ్​ చేసిందని ఫ్యాన్స్​ అంటున్నారు. తన రోల్​ ఎలా ఉండనుందో అంటూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Rashmika Mandanna Upcoming Movies : ఇక రష్మిక లైనప్​ విషయానికి వస్తే.. 'పుష్ప' సినిమాతో భారీ సక్సెస్ అందుకున్న ఈ చిన్నది తాజాగా బాలీవుడ్ స్టార్ హీర రణ్​బీర్​ కపూర్​తో కలిసి 'యానిమల్​' అనే సినిమాలో నటించింది. 'గుడ్ బై' సినిమాతో బాలీవుడ్​లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు.. ఆ తర్వాత 'మిషన్ మజ్ను'లోనూ నటించింది. అయితే బాక్సాఫీస్​ వద్ద ఈ రెండు సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడలేదు. దీంతో ప్రస్తుతం ఆమె తన మూడో చిత్రం యానిమల్​పై ఆశలు పెట్టుకుంది. మరోవైపు తెలుగులో 'పుష్ప 2' తో పాటు రవితేజ-గోపిచంద్ మలినేని కాంబోలో తెరకెక్కుతున్న ఓ చిత్రంలో నటిస్తోంది.

Sree Leela VD 12 : విజయ్​ సినిమా నుంచి శ్రీలీల ఔట్​.. ఆ జంట ముచ్చటగా మూడోసారి!

Rashmika Career : ఆ రెండిటిపైనే రష్మిక ఆశలు​.. అలా జరిగితేనే మళ్లీ టాప్​లోకి!

Last Updated : Oct 22, 2023, 2:19 PM IST

ABOUT THE AUTHOR

...view details