తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

మేనేజర్​ చేతిలో మోసపోయిన రష్మిక!.. ఏకంగా అన్ని లక్షలకు టోకరా? - రష్మిక మందాన్న రేయిన్​బో

Rashmika Mandanna Manager : నటి రష్మిక మందాన్నను.. తన దగ్గరే ఎంతో నమ్మకంగా ఉండే మేనేజర్​ డబ్బుల విషయంలో మోసం చేశాడని తెలిసింది. ఆ వివరాలు..

Rashmika Mandanna Removed His Manger From Job
మేనేజర్​ జాబ్​ కట్​ చేసిన నటి రష్మిక.. రూ.80 లక్షలు మోసం చేశాడంటూ.. ఇందులో నిజమెంత..?

By

Published : Jun 19, 2023, 3:39 PM IST

Updated : Jun 19, 2023, 4:41 PM IST

Rashmika Mandanna Manager : ప్రముఖ హీరోయిన్​ రష్మిక గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నేషనల్​ క్రష్​గా స్పెషల్​ ఇమేజ్​ను క్రియేట్​ చేసుకున్న ఈ ముద్దుగుమ్మకు యూత్​లో ఫుల్​ క్రేజ్​. అయితే తాజాగా మందాన్నకు ఓ షాకింగ్ ఇన్సిడెంట్​ ఎదురైనట్లు తెలిసింది! ఆమె ఆర్థిక లావా దేవిల విషయంలో ఓ వ్యక్తి చేతిలో మోసపోయిందంటూ ప్రచారం సాగుతోంది. తన కెరీర్​ మొదటినుంచి తన దగ్గరే ఎంతో నమ్మకంగా పనిచేస్తున్న మేనేజర్​ ఆమెను మోసం చేశాడంటూ వార్తలు వస్తున్నాయి. దీంతో ఆమె అతడిని ఉద్యోగం నుంచి తొలగించినట్లు సమాచారం. సదరు మేనేజర్​ తనకు తెలియకుండా సుమారు రూ.80 లక్షల వరకు కాజేశాడనే ఆరోపణలు బయటపడటంతో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.

తనకు సమాచారం ఇవ్వకుండా రూ.80 లక్షలను మేనేజర్​ వాడుకున్నాడంటూ రష్మికఅతడిపై చీటింగ్​ కేసు కూడా ఫైల్​ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయం బయటకు పొక్కకుండా హీరోయిన్​ జాగ్రత్త పడినట్లు సమాచారం. అయితే ఈ వ్యవహారంపై రష్మిక టీమ్​ మాత్రం అధికారికంగా స్పందించలేదు. మరి మేనేజర్ నిజంగానే మోసం చేశాడా? లేదంటే ఇదంతా ప్రచారమేనా? అనే విషయంపై క్లారిటీ రావాలంటే.. రష్మిక స్పందించే వరకు వేచి ఉండాల్సిందే.

Rashmika Animal Movie : ఇక రష్మిక సినిమాల విషయానికి వస్తే.. 2018లో వచ్చిన 'ఛలో' సినిమాతో టాలీవుడ్​లో అడుగుపెట్టిన ఈ కన్నడ బ్యూటీ 'గీతా గోవిందం'తో కొద్దికాలంలోనే తెలుగు ఆడియనస్​కు మరింత చేరువయ్యారు. ఈ సినిమాతో ఆమె విమరీతమైన క్రేజ్​ను సంపాదించుకున్నారు. వరుసగా స్టార్​ హీరోల సినిమాల్లో నటిస్తూ టాలీవుడ్​లో టాప్​ హీరోయిన్​ల లిస్ట్​లోకి చేరిపోయారు.

అలా ఈ ఏడాది జనవరిలో విడుదలైన హిందీ స్పై థ్రిల్లర్ 'మిషన్ మజ్ను'లో నటించి అలరించారు. ప్రస్తుతం బాలీవుడ్​ నటుడు రణబీర్ కపూర్ సరసన 'యానిమల్‌'లో నటిస్తున్నారు. యాక్షన్ డ్రామా థ్రిల్లర్​గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్​ సీనియర్​ నటులు అనిల్​ కపూర్​, బాబీ డియోల్​ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇటివలే విడుదలైన ఈ సినిమా ప్రీ-టీజర్‌కు మంచి రెస్పాన్స్​ వస్తోంది. తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ, తమిళం భాషల్లో ఆగస్ట్​ 11న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Rashmika Mandanna Pushpa : మరోవైపు అల్లు అర్జున్ సరసన పుష్ప సీక్వెల్​ 'పుష్ప: ది రూల్'లో కూడా నటిస్తున్నారు. సుకుమార్​ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రష్మిక శ్రీవల్లి క్యారెక్టర్​లో కనిపించనున్నారు. రేయిన్‌బో అనే లేడి ఓరియెంటెడ్‌ సినిమాలో కూడా నటిస్తున్నారు రష్మిక.

Last Updated : Jun 19, 2023, 4:41 PM IST

ABOUT THE AUTHOR

...view details