Rashmika Mandanna Kannada Industry: స్టార్ హీరోయిన్ రష్మికను ఆమె మాతృక కన్నడ సినీ పరిశ్రమ బ్యాన్ చేసిందట. ఇకపై ఏ కన్నడ సినిమాలో నటించకుండా ఆమెపై నిషేధం విధించారట. తరచూ ఆమె కన్నడ పరిశ్రమను అగౌరవపరుస్తూ వ్యాఖ్యలు చేస్తున్నందున తట్టుకోలేని కన్నడిగులు ఆమెపై వేటు వేసేందుకు సిద్ధపడ్డారట. ఈ క్రమంలో కర్ణాటకలోని థియేటర్ల ఓనర్లు, డిస్ట్రిబ్యూటర్లు, సినీ పరిశ్రమతో సహా ఆమెకు వ్యతిరేకంగా నిలుస్తోందట. త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారట.
మరో వివాదంలో హీరోయిన్ రష్మిక.. కన్నడ ఇండస్ట్రీ ఆమెను బ్యాన్ చేయనుందా? - రష్మిక లేటెస్ట్ ఇంటర్వ్యూ
తనకు తొలి అవకాశం ఇచ్చిన నిర్మాణ సంస్థ పేరు ఎత్తకుండా సో కాల్డ్ ప్రొడక్షన్ హౌస్ అని రష్మిక సంభోదించడం కన్నడ సినీ ప్రేక్షకులకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. తన సినీ జీవితాన్ని ఇచ్చిన తల్లి లాంటి నిర్మాణ సంస్థనే మరిచిపోయి.. కృతజ్ఞత లేకుండా ఉన్నావా అంటూ ఆమెపై సోషల్ మీడియాలో దుమ్మెత్తి పోస్తున్నారు. అసలేం జరిగింది?
హిందీలోని ఓ మీడియా సంస్థకు ఇచ్చిన వీడియో ఇంటర్వ్యూలో రష్మిక తన సినీ ప్రయాణం గురించి చెబుతూ తనకు తొలి అవకాశం ఇచ్చిన నిర్మాణ సంస్థ పేరును ప్రస్తావించలేదు. అంతేకాకుండా, రెండు చేతులతో 'సో కాల్డ్ ప్రొడక్షన్ హౌస్' అనే అర్థమొచ్చేలా సైగలు చేస్తూ చెప్పారు. ఇది కన్నడ సినీ ప్రేక్షకులకు ఆగ్రహం తెప్పించింది.
'కిరిక్ పార్టీ' అనే సినిమా ద్వారా రష్మిక వెండితెరకు పరిచయమయ్యారు. ఈ సినిమా రక్షిత్ శెట్టి హీరో, నిర్మాత. రిషబ్ శెట్టి దర్శకత్వం వహించారు. అయితే రక్షిత్ శెట్టితో రష్మిక ప్రేమాయణం, నిశ్చితార్థం, ఆ తరవాత పెళ్లిని రద్దు చేసుకున్నారు. ఈ కారణాల చేతే ఆమె తనకు తొలి అవకాశమిచ్చిన ప్రొడక్షన్ హౌస్ పేరెత్తలేదని ఆమె ఫ్యాన్స్ ఆరోపణ. దీనిలో భాగంగానే ఇప్పుడు రష్మికపై నిషేధం విధించినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతానికి ఇదొక రూమర్ అయినప్పటికి దీని వల్ల ఆమె నటించిన 'వారిసు', 'పుష్ప 2' సినిమాలను సైతం కన్నడలో విడుదల కాకుండా అడ్డుకుంటారన్న వదంతులు వస్తున్నాయి.