Rashmika Mandanna Animal Movie :కన్నడ బ్యూటీ రష్మిక మందన్న ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు పొంది సక్సెస్ఫుల్ హీరోయిన్గా దూసుకెళ్తోంది. 'ష్ప ది రైజ్' సినిమాతో శ్రీ వల్లిగా కనిపించి అభిమానులను అలరించిన ఈ స్టార్, ఇటీవలే విడుదలైన 'యానిమల్' సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం 'పుష్ప 2'తో పాటు ధనుశ్ మూవీ షూటింగ్లో బిజీగా ఉన్న ఈ చిన్నది తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని 'యానిమల్' మూవీ గురించి ముచ్చటించింది.
యానిమల్‌లో ఆమె రణ్‌బీర్‌కు భార్యగా గీతాంజలి అనే పాత్రలో కనిపించింది. ఈ నేపథ్యంలో వీరిద్దరి మధ్య జరిగిన ఓ సీన్ తర్వాత ఆమె ఏడ్చినట్లు చెప్పుకొచ్చింది. రణ్‌బీర్‌ను కొట్టి కేకలు పెట్టానంటూ వెల్లడించింది.
"యానిమల్ సినిమాలో రణ్‌బీర్‌ను కొట్టే సీన్ నాకో సవాల్‌గా అనిపించింది. సింగిల్ టేక్‌లోనే ఆ సీన్‌ను షూట్ చేశాం. డైరెక్టర్ సందీప్ సీన్‌ను వివరించారు. పరిస్థితిని ఫీలవ్వాలంటూ చెప్పారు. నాకు ఆ ఒక్క మాట మాత్రమే గుర్తుంది. అంతే యాక్షన్, కట్ మధ్యలో ఏం జరిగిందో ఇంకేం గుర్తు లేదు. రణ్‌బీర్‌ను అరిచాను. కోపంతో అతడ్ని చెంపపై కొట్టాను. అయితే షాట్ ఓకే అని డైరెక్టర్ చెప్పినా కూడా నాకు కన్నీళ్లు ఆగలేదు. బాగా ఏడ్చేశాను. ఆ తర్వాత రణ్‌బీర్ దగ్గరికి వెళ్లి 'అంతా ఓకేనా' అని అడిగాను." అంటూ ఆ రోజు జరిగిన ఘటనను గుర్తు చేసుకుంది.