తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

రష్మిక బ్యూటీ సీక్రెట్- హ్యాండ్ బ్యాగ్​లో అది పక్కాగా ఉండాల్సిందేనట! - రష్మిక బ్యూటీ సీక్రెట్

Rashmika Beauty Secrets : అటు నార్త్, ఇటు సౌత్​లో గ్యాప్ లేకుండా దూసుకుపోతోంది హీరోయిన్​ రష్మిక మందన్న. వరుస సినిమాలు చేస్తూ హిట్లను ఖాతాలో వేసుకుంటోంది. మరి ఈ బ్యూటీ సీక్రెట్ ఏంటో తెలుసా? తన బ్యాగ్ ఆమె ఎప్పుడూ క్యారీ చేసేవేంటో తెలుసా?

Rashmika Beauty Secrets
Rashmika Beauty Secrets

By ETV Bharat Telugu Team

Published : Jan 3, 2024, 8:28 AM IST

Rashmika Beauty Secrets :ప్రస్తుతం రష్మిక మందన్న మోస్డ్ వాంటెడ్ హీరోయిన్​గా మారిపోయింది. అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్ అన్న తేడా లేకుండా సినిమాలు చేస్తూ బిజీబిజీగా గడుపుతోంది. ఐకాన్​ స్టార్ పుష్ప సినిమాతో నేషనల్ క్రష్​గా మంచి పేరు సంపాదించుకుంది. అప్పటికే బీటౌన్​లో ట్రైల్స్ వేస్తున్న ఆమెకు పుష్ప హిట్ బాగా కలిసొచ్చింది. డీగ్లామర్ రోల్​ అయినా యాక్షన్​, ఎక్స్​ప్రెషన్స్​, స్క్రీన్​ ప్రెజెన్స్​తో అదరగొట్టేసేంది.

ఆ సినిమా తర్వాత రష్మికకు బాగా అవకాశాలు పెరిగాయి. అప్పటి నుంచి జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేస్తోంది ఈ బ్యూటీ. ఆమె కెరీర్​ను మలుపు తిప్పిన సినిమాల్లో రెండు సినిమాలు పక్కా మాస్ మసాలా చిత్రాలే. మరి ముఖ్యంగా పుష్ప, యానిమల్ సినిమాలతో ఇండస్ట్రీలను షేక్ చేసి పడేసింది బ్యూటీ. ఇక రష్మిక మందన్న ఇంత అందంగా ఉండడానికి కారణం ఏంటి? ఆమె ఏం చేస్తుంది? ప్రస్తుతం అందుకు సంబంధించిన వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది.

రష్మికకు ఆరోగ్యంపై శ్రద్ధ ఎక్కువ. ఆమెతో పాటు షూటింగ్​లో ట్రావెల్ చేసేవారికి ఈ విషయం బాగా అర్ధం అవుతుంది. తనకు నచ్చిన ఫుడ్ ఇష్టంగా తిన్నా జిమ్ డుమ్మా కొట్టకుండా చేస్తుంది. అందుకే వెయిట్ కంట్రోల్ మేనేజ్మెంట్​లో ఉంటుంది. షూటింగ్ కోసం అవుట్ డోర్​కు వెళ్లినా కానీ ఆమె వర్కౌట్స్​ను మానేయదట. ఏదో ఒక ప్లేస్ చూసుకుని చేసేస్తుందట. అయితే రష్మిక స్కిన్ మాత్రం ఎప్పుడూ గ్లో గా ఉంటుంది. అందుకు కారణమేంటో తెలిసిపోయింది!

రోజుకు రష్మిక ఏడు లీటర్ల వాటర్ పక్కాగా తాగేస్తుందట. నిద్రలేచిన మొదలు రాత్రి పడుకునే వరకు వాటర్​ను మిస్ అవ్వకుండా గుర్తు పెట్టుకుని మరీ బాగా ఎక్కువగా తీసుకుంటుందట. అంతే కాదు వాటర్ కంటెంట్ ఉన్న వాటర్ మిలన్​తో పాటు కొబ్బరి నీళ్లు, జ్యూస్ కచ్చితంగా తాగుతుందట. ఎక్కడికి వెళ్లినా సరే ఆ హ్యాండ్ బ్యాగ్​లో కచ్చితంగా వాటర్ బాటిల్ ఉండాల్సిందేనట. అందుకే ఆమె అంత అందంగా చక్కగా ఉంటుందట. ఈ విషయం తెలిసి అభిమానులతోపాటు నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఎన్ని క్రీములు పూసినా నేచురల్ అందం రావాలంటే ప్రకృతిని నమ్ముకోవాల్సిందేనని కామెంట్లు పెడుతున్నారు.

'అమ్మాయిలకు నేను ఇచ్చే సలహా ఇదే - అస్సలు సైలెంట్​గా ఉండొద్దు'

బాయ్​ఫ్రెండ్ డీటెయిల్స్​ షేర్ చేసిన రష్మిక- అబ్బాయిది బళ్లారి అంట!

ABOUT THE AUTHOR

...view details