తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'అదేం రాత్రికి రాత్రి రాలేదు.. ఏడేళ్లుగా ఎంతో కష్టపడుతున్నా' - రష్మిక సక్ెస్​

Rashmika About Her Success: 'పుష్ప' సినిమాలో శ్రీవల్లి పాత్రలో ఒదిగిపోయి దేశవ్యాప్తంగా క్రేజ్​ సంపాదించుకున్న భామ రష్మిక. తన అందంతో అభినయంతో ఎంతో అభిమానులను సొంతం చేసుకున్న ఆమె.. తాజాగా తన సెక్సెస్​ గురించి మాట్లాడారు. ఏడేళ్లుగా తాను ఎంతో కష్టపడుతున్నానని చెప్పుకొచ్చారు.

Rashmika About Her Success:
Rashmika About Her Success:

By

Published : Aug 1, 2022, 8:51 AM IST

Rashmika About Her Success: 'ఓ నటిగా భాషాపరమైన హద్దులను నేనెప్పుడూ ఫీల్‌ కాలేదు' అంటున్నారు హీరోయిన్‌ రష్మిక మందన్న. ఈ విషయం గురించి ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడారు. 'రాత్రికి రాత్రే నాకు సక్సెస్‌ రాలేదు. ఏడేళ్లుగా ఎంతో కష్టపడుతున్నాను. ప్రాంతం, భాష ఆధారంగా కొందరు సినిమాను విభజించి చూస్తారు. కానీ నటిగా నాకు యాక్టింగ్‌ క్రాఫ్ట్‌పై పట్టు ఉన్నప్పుడు నా భావోద్వేగాలు ప్రేక్షకులకు అర్థం అయ్యేలా నటించడానికి భాష హద్దు కాదని భావిస్తాను.

రష్మిక

వివిధ భాషల్లో సినిమాలు చేసే అవకాశం లభిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. కరోనా కారణంగా ఆగిపోయిన నా ప్రాజెక్ట్​లు పూర్తి చేసే పనిలో ఉన్నాను. వచ్చే ఏడాది నేను నటించిన సినిమాలు ఎక్కువగా విడుదల అయ్యే అవకాశాలున్నాయి. వాటి పట్ల ఎంతో ఆసక్తిగా ఉన్నాను' అంటూ రష్మిక చెప్పుకొచ్చారు. ఇప్పటికే రష్మిక నటించిన హిందీ చిత్రాలు 'గుడ్‌ బై', 'మిషన్‌ మజ్నూ' రిలీజ్‌కు సిద్ధంగా ఉన్నాయి. ప్రస్తుతం 'వారసుడు', 'యానిమల్‌' చిత్రాలతో ఆమె బిజీగా ఉన్నారు.

రష్మిక

ABOUT THE AUTHOR

...view details