Bear grylls Ranveer singh: ప్రముఖ మనుగడ పోరాటాల వీరుడు బేర్ గ్రిల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అడవీ ప్రాంతాలు, కొండలు, లోయలు, సముద్రాలు, నదీ తీరాల వెంట ప్రయాణిస్తూ.. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో ఆయన చేసే సాహసాలు ఒళ్లు గగుర్పొడుస్తుంటాయి.
రణ్వీర్ సాహసం.. ఎలుగుబంటితో పోరాటం! - ఎలుగుబంటి రణ్వీర్ సింగ్
Bear grylls Ranveer singh: మన దేశానికి చెందిన ప్రముఖులు ప్రధాని మోదీ, రజనీకాంత్, అక్షయ్ కుమార్, అజయ్‌దేవగణ్, విక్కీకౌశల్లతో సాహసాలు చేయించిన సాహసికుడు బేర్ గ్రిల్స్.. ఈసారి మరో బాలీవుడ్ హీరో రణ్‌వీర్‌సింగ్‌తో అదిరిపోయే అడ్వెంచర్లు చేయించారు. దీనికి సంబంధించిన టీజర్ విడుదల కాగా.. ఎపిసోడ్ జులై 8న ప్రసారం కానుంది.
ఇప్పటికే ఆయన ప్రధాన నరేంద్ర మోదీ, బాలీవుడ్ స్టార్ అక్షయ్‌కుమార్, అజయ్‌దేవగణ్, విక్కీ కౌశల్, సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో చేసిన సాహసాలు గూస్బంప్స్ తెప్పించాయి. అయితే ఇప్పుడు మరో స్టార్ హీరోతో సాహస యాత్రను చేశారు. బాలీవుడ్ యాక్టర్ రణ్వీర్ సింగ్‌తో కలిసి కళ్లు చెదిరే అడ్వెంచర్స్ చేశారు. దీనికి సంబంధించిన టీజర్ విడుదలైంది. ఇందులో రణ్వీర్ దట్టమైన అడవుల్లో ఓ భయంకరమైన ఎలుగుబంటి నుంచి తప్పించుకుంటున్నట్లు, ఎత్తైన పర్వతాలను రోప్ సాయంతో దాటుతూ కనిపించారు. 'రణ్వీర్ వర్సెస్ వైల్డ్ విత్ బేర్ గ్రిల్స్' పేరుతో రానున్న ఈ కార్యక్రమం జులైన 8న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.
ఇదీ చూడండి:అసలు పెళ్లే వద్దనుకున్నాడు.. ఇప్పుడు ఆమెతో పీకల్లోతు ప్రేమలో.. ఆ ఒక్క ఇంటర్వ్యూతో..