తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

దీపికా పదుకొణెతో మనస్పర్థలు.. రణ్​వీర్​ ఏం చెప్పారంటే? - రణ్​వీర్ సింగ్ దీపికా పదుకొణె డివర్స్​

బాలీవుడ్​ రియల్​ లైఫ్​ జోడీ రణ్​వీర్ సింగ్​​, దీపికా పదుకొణె మధ్య విభేదాలు తలెత్తినట్లు కొద్ది రోజుల క్రితం వార్తలు వచ్చాయి. అయితే తాజాగా దీనిపై రణ్​వీర్​ స్పందించారు. ఏమన్నారంటే..

ranveer singh deepika padukone reletionship
రణ్​వీర్ దీపిక రిలేషన్​ షిప్​

By

Published : Sep 29, 2022, 5:43 PM IST

బాలీవుడ్ స్టార్ కపుల్స్​లో రణ్​వీర్​ సింగ్​-దీపికా పదుకొణె ఒకరు. వీరిద్దరూ పలు సందర్భాల్లో ఒకరిపై మరొకరికి ఉన్న ప్రేమను తెలిపారు. పెళ్లి తర్వాత వీరిద్దరిని కలిసి తెరపై చూడాలని చాలా మంది అభిమానులు ఆశించారు. అయితే ఈ జంట మధ్య కొన్ని కలతలు చోటు చేసుకున్నాయి అంటూ అనుమానాలు వ్యక్తమయ్యాయి. వీరిద్దరి మధ్య ముందున్నంత సఖ్యత ఉండటం లేదని వార్తలు వచ్చాయి. విడాకులు కూడా తీసుకునే అవకాశం ఉందని మరికొంతమంది అనుకున్నారు. అయితే తాజాగా దీనిపై రణ్​వీర్​ స్పందించారు. తమ బంధం ఎంతో బాగుందని స్పష్టం చేశారు.

"మేం 2012లో డేటింగ్ చేయడం ప్రారంభించాం. ఇప్పుడు 2022. మా బంధం మొదలై పదేళ్లు పూర్తైంది. ఆమె అంటే చాలా గౌరవం, ప్రేమ. నా వ్యక్తిగత జీవితంలో తన నుంచి చాలా నేర్చుకున్నాను. మీ అందరికీ ఓ స్వీట్​ సర్​ప్రైజ్​ ఇవ్వబోతున్నాం. త్వరలోనే కలిసి నటిస్తాం. నా జీవితంలో జరిగిన అద్భుతమైన విషయాల్లో తను ఒకటి. ఆమె నాతో ఉండటం ఎంతో గొప్పగా భావిస్తున్నాను. నా సక్సెస్​ సీక్రెట్​ తనే" అని రణ్​వీర్ అన్నారు.

రణ్​వీర్ దీపిక

సినిమాల విషయానికొస్తే.. షారుఖ్‌ ఖాన్‌ హీరోగా తెరకెక్కుతున్న 'పఠాన్‌', హృతిక్ రోషన్‌ 'ఫైటర్‌'లో కథానాయికగా నటిస్తున్నారు దీపికా. ప్రభాస్‌ హీరోగా దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ తెరకెక్కిస్తున్న 'ప్రాజెక్ట్‌ కె' (వర్కింగ్‌ టైటిల్‌) చిత్రంతో టాలీవుడ్‌లో ఆమె అడుగుపెట్టనున్నారు. 'జయేశ్‌భాయ్‌ జోర్దార్‌' సినిమాతో మే లో ప్రేక్షకుల ముందుకొచ్చారు రణ్‌వీర్‌. ప్రస్తుతం 'సర్కస్‌', 'రాకీ ఔర్‌ రాణీ కీ ప్రేమ్‌ కహానీ' సినిమాల్లో నటిస్తున్నారు. రణ్‌వీర్‌, దీపికా కలిసి నటించిన తొలి సినిమా 'రామ్‌-లీల'. సుమారు ఆరేళ్లు ప్రేమలో ఉన్న ఈ ఇద్దరు 2018లో వివాహబంధంతో ఒక్కటయ్యారు.

రణ్​వీర్ దీపిక

ఇదీ చూడండి: సతీమణి స్నేహారెడ్డి బర్త్​డే.. ఫ్యామిలీతో కలిసి గోల్డెన్​ టెంపుల్​ను సందర్శించిన బన్నీ

ABOUT THE AUTHOR

...view details