తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

Filmfare awards 2022.. ఉత్తమ నటులుగా రణ్​వీర్​, కృతి - ఉత్తమ నటుడిగా రణ్​వీర్​

Filmfare awards 2022 winners ముంబయిలో అంగ‌రంగ వైభవంగా జ‌రిగింది ఫిల్మ్ ఫేర్ అవార్డుల ప్రదానోత్సవ కార్య‌క్ర‌మం. 2022 సంవ‌త్స‌రానికి గాను ఉత్త‌మ న‌టుడిగా ర‌ణ్​వీర్​ సింగ్, ఉత్త‌మ న‌టిగా కృతి స‌న‌న్​ అవార్డులను స్వీక‌రించారు. ఇంకా ఎవరెవరంటే

Film Fare awards 2022
ఫిల్మ్​ ఫేర్ అవార్డ్స్​ 2022

By

Published : Aug 31, 2022, 3:32 PM IST

Updated : Aug 31, 2022, 4:13 PM IST

Filmfare awards 2022 winners బాలీవుడ్​లో ఫిల్మ్ ఫేర్ అవార్డుల ప్రదానోత్సవం వైభవంగా జరిగింది. వీటికి సంబంధించిన వివరాలను ఫిల్మ్‌ఫేర్ ఎడిటర్ నేతృత్వంలోని బృందం ప్రకటించింది. ఈ ఏడాది షేర్షా, సర్దార్ ఉద్దమ్, మిమీ సినిమాలు ఎక్కువ అవార్డ్స్ సాధించాయి.

1983లో వరల్డ్ కప్ నేపథ్యంలో వచ్చిన 83 సినిమాలో అద్భుత నటన ప్రదర్శనకుగానూ హీరో రణ్ వీర్ సింగ్ ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు. మిమి మూవీలో ప్రధాన పాత్రలో నటించిన కృతి సనన్ ఉత్తమ నటిగా ఫిల్మ్ ఫేర్ గెలుచుకున్నారు. ఇక ఫిల్మ్‌ఫేర్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును సుభాష్ ఘాయ్ సొంతం చేసుకున్నారు. వీరితో పాటు మరికొందరు స్టార్ హీరో, హీరోయిన్లు కూడా ఈ అవార్డులను అందుకున్నారు. ఇక ఇతర విభాగాల్లో అవార్డులు సాధించిన వారి విషయానికొస్తే...

ఉత్తమ నటుడు: రణ్‌వీర్‌ సింగ్‌ (83)
ఉత్తమ నటి: కృతి సనన్‌ (మిమీ)
ఉత్తమ నటుడు (క్రిటిక్స్‌ ఛాయిస్‌) : విక్కీ కౌశల్‌ (సర్దార్‌ ఉదమ్‌)
ఉత్తమ నటి (క్రిటిక్స్‌ ఛాయిస్‌) : విద్యా బాలన్‌ (షేర్నీ)
ఉత్తమ దర్శకుడు: విష్ణువర్ధన్‌ (షేర్షా)
ఉత్తమ చిత్రం : షేర్షా
ఉత్తమ సినిమా (క్రిటిక్స్‌ ఛాయిస్‌) : సర్దార్‌ ఉదమ్‌
ఉత్తమ సహాయనటుడు: పంకజ్‌ త్రిపాఠి (మిమీ)
ఉత్తమ సహాయనటి : సాయి తమ్హంకర్(మిమీ)
ఉత్తమ కథ: అభిషేక్‌ కపూర్‌, సుప్రతిక్ సేన్ (చండీగఢ్ కరే ఆషికి)
ఉత్తమ సంభాషణలు: దిబాకర్‌ బెనర్జీ, వరుణ్‌ గ్రోవర్‌ (సందీప్ ఔర్ పింకీ ఫరార్)
ఉత్తమ ఒరిజినల్‌ కథ: చండీగఢ్ కరే ఆషికి
ఉత్తమ నూతన నటుడు: ఇహాన్ భట్‌ (99 సాంగ్స్‌)
ఉత్తమ నూతన కథానాయిక: శార్వరి వాఘ్ (బంటీ ఔర్ బబ్లీ 2)
ఉత్తమ నూతన దర్శకుడు: సీమా పహ్వా (రాంప్రసాద్ కీ తెర్వి)
ఉత్తమ ఆల్బమ్‌: షేర్షా
ఉత్తమ లిరిక్స్‌: లెహ్రా దో (83)
ఉత్తమ గాయకుడు: బి ప్రాక్ (షేర్షా)
ఉత్తమ గాయిని: అసీస్ కౌర్ (షేర్షా)
ఉత్తమ యాక్షన్‌: షేర్షా
ఉత్తమ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌: సర్దార్‌ ఉదమ్‌
ఉత్తమ కొరియోగ్రఫీ: అత్రాంగిరే (హే చక చక్)
ఉత్తమ సినిమాటోగ్రఫీ: సర్దార్‌ ఉదమ్‌
ఉత్తమ కాస్ట్యూమ్స్‌‌: సర్దార్‌ ఉదమ్‌
ఉత్తమ ఎడిటింగ్‌: షేర్షా
ఉత్తమ ప్రొడక్షన్‌ డిజైన్‌ (సర్దార్‌ ఉదమ్‌‌)
ఉత్తమ సౌండ్‌ డిజైన్‌: సర్దార్‌ ఉద్ధమ్‌
ఉత్తమ వీఎఫ్‌ఎక్స్‌: సర్దార్‌ ఉదమ్‌
జీవిత సాఫల్య పురస్కారం: సుభాష్ ఘాయ్

ఇదీ చూడండి: కథ నచ్చినా కమల్​హాసన్ మూవీకి నో చెప్పిన ప్రొడ్యూసర్స్​, ఎందుకంటే

Last Updated : Aug 31, 2022, 4:13 PM IST

ABOUT THE AUTHOR

...view details