Ranveer singh nude photoshoot: న్యూడ్ ఫొటోషూట్‌తో చిక్కుల్లో పడిన బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్‌సింగ్‌కు.. మరోసారి అదే రకమైన ఫొటోషూట్ ఆహ్వానం అందింది. మూగజీవాల సంరక్షణకు పాటుపడే 'పీపుల్ ఫర్ ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్స్' (పెటా) .. జంతువుల పరిరక్షణ కోసం న్యూడ్ ఫొటోషూట్ చేయాలని ఆహ్వానించింది. ప్రజలను శాఖాహారులుగా మార్చాలనే ఉద్దేశంతో చేపట్టిన ప్రచార కార్యక్రమంలో పాల్గొనాలంటూ రణ్‌వీర్‌సింగ్‌ను సంప్రందించింది. మూగజీవాల పరిరక్షణకు ఏర్పాటు చేసిన ప్రచార కార్యాక్రమంలో భాగం కావాలని విజ్ఞప్తి చేస్తూ లేఖను రాసింది. ఈ లేఖలో ప్రచారంలో పాల్గొనే ఇతర సెలబ్రెటీలతో పాటు.. శాఖాహారం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను సంస్థ వివరించింది. అయితే ఇప్పటికే న్యూడ్ ఫొటోషూట్‌తో చిక్కుల్లో పడిన రణ్వీర్.. ఈ ఆఫర్‌ను అంగీకరిస్తాడా? అన్నది తేలాల్సి ఉంది.
ఇటీవల బాలీవుడ్ స్టార్ రణ్వీర్ సింగ్.. పోస్ట్ చేసిన న్యూడ్ ఫొటోషూట్ చిత్రసీమలో హాట్ టాపిక్‌గా మారింది. ఒంటిపై నూలు పోగు లేకుండా ఆయన దిగిన ఫొటోలు బాగా వైరల్‌గా మారాయి. ముంబయిలోని చెంబూర్ పోలీస్ స్టేషన్లో రణ్‌వీర్‌పై ఫిర్యాదు నమోదైంది. ఓ ఎన్జీఓ సంస్థ ఈ కంప్లెయింట్ ఇచ్చింది. రణ్వీర్.. మహిళల మనోభావాలను దెబ్బతీశాడని, వారిని అవమానించాడని ఫిర్యాదులో పేర్కొంది. కేసు రిజిస్టర్ చేయాలని డిమాండ్ చేసింది. ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం రణవీర్ 'సర్కస్', 'రాఖీ ఔర్ రాణికీ ప్రేమ్ కహానీ' అనే సినిమాల్లో నటిస్తున్నారు. ఆయన భార్య హీరోయిన్ దీపికా పదుకోణె.. 'ప్రాజెక్ట్ కే', 'పఠాన్' చిత్రాల్లో నటిస్తోంది.