కోలీవుడ్ స్టార్ విజయ్ మేనియా ఇప్పుడు యూట్యూబ్‌ని షేక్ చేస్తోంది. ఆయన హీరోగా నటించిన 'వారిసు' లోని ఫస్ట్ సింగిల్ నెట్టింట విపరీతమైన క్రేజ్‌ను సొంతం చేసుకుంది. 'రంజితమే' అంటూ సాగే ఈ మాస్ సాంగ్‌ను విడుదల చేసి పది రోజులవుతోన్నా క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు సరికదా.. మరింత పెరుగుతోంది.
ఈ విషయాన్నే తెలియజేస్తూ చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ ఓ సరికొత్త పోస్టర్ షేర్ చేసింది. ఇప్పటివరకూ ఈ పాట 5 కోట్ల వ్యూస్, 18 లక్షల లైక్స్ సొంతం చేసుకుందని పేర్కొంది. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్ ట్రెండింగ్‌లో మూడో స్థానంలో కొనసాగుతోంది. ఫ్యామిలీ, మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న చిత్రం 'వారిసు'. వంశీ పైడిపల్లి దర్శకుడు.