తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'నేనొక నటుడ్ని.. అల్పసంతోషిని'... మనసును తాకేలా చిరు మాటలు

క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వం వహించిన తాజా సినిమా 'రంగమార్తాండ'. ఇందులో రంగస్థల కళాకారుల గురించి వివరంచే ఓ షాయరీ ఉంది. దీనికి మెగాస్టార్ చిరంజీవి గళం అందించారు. అయితే తాజాగా దీనిని విడుదల చేశారు. ఇందులో చిరు మాట్లాడిన మాటలు మనసును తాకుతున్నాయి.

Chiranjeevi rangamartanda
'నేనొక నటుడ్ని.. అల్పసంతోషిని'... మనసును తాకేలా చిరు మాటలు

By

Published : Dec 21, 2022, 12:42 PM IST

రంగస్థల నటీనటుల జీవితాన్ని ఆధారంగా చేసుకుని కృష్ణవంశీ తెరకెక్కించిన చిత్రం 'రంగమార్తాండ'. ప్రకాశ్‌రాజ్‌, రమ్యకృష్ణ, బ్రహ్మానందం ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా నుంచి ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న షాయరీ బుధవారం విడుదలైంది. దీనికి మెగాస్టార్ చిరంజీవి గళం అందించారు. అంతే కాదు.. గళం అందించే సమయంలో కంటతడి పెట్టుకున్నారు. ఇది అభిమానులను ఆకట్టుకుంటోంది.

ఇందులో చిరు.. గంభీరమైన గాత్రంలో తన గురించి తానే చెప్పుకున్నట్లు అర్థమవుతోంది. ఓ నటుడు జీవన శైలి ఎలా ఉంటుంది.. రంగస్థల నటుడి జీవితం ఎలా ఉంటుంది? అనేది ఎంతో గొప్పగా వర్ణించారు. దీనికి ఇళయరాజా అందించిన బాణీ కూడా ఆకట్టుకుంటోంది.

"నేనొక నటుడ్ని.. చమ్‌కీలబట్టలు వేసుకుని, అట్ట కిరీటం పెట్టుకుని, చెక్క కత్తి పట్టుకుని, కాగితాల పూల వర్షంలో కీలుగుర్రంపై స్వారీ చేసే చక్రవర్తిని నేను.. కాలాన్ని బంధించిన శాసించగల నియంతని నేను.. నేనొక నటుడ్ని.. నాది కాని జీవితాలకు జీవం పోసే నటుడ్ని.. నేను కాని పాత్రల కోసం వెతికే విటుడ్ని.. వేషం కడితే అన్ని మతాల దేవుడ్ని.. వేషం తీస్తే ఎవ్వరికీ ఏమీ కానీ జీవుడ్ని.. అంటూ సాగిన షాయరీ ప్రేక్షకుల్ని ఆలోచింపజేసేలా ఉంది. కాగా, రంగమార్తాండ సినిమా మరాఠీలో వచ్చిన నటసామ్రాట్ అనే సినిమాకు రీమేక్‌.

ఇదీ చూడండి:మెగా ఫ్యామిలీలో సెలబ్రేషన్స్​.. స్టార్స్​ అంతా ఒకే ఫ్రేమ్​లో.. ఫ్యాన్స్​ ఫుల్​ ఖుషీ!

ABOUT THE AUTHOR

...view details