Rangabali Movie Review : తెలుగు ప్రేక్షకుల్లో లవర్‌బాయ్‌గా గుర్తింపు పొందిన నాగశౌర్య, యంగ్ బ్యూటీ యుక్తి తరేజా జంటగా నటించిన తాజా చిత్రం 'రంగబలి'. శుక్రవారం ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. అయితే చాలా రోజుల నుంచి హిట్ సినిమాలు లేని నాగశౌర్య.. ఈ సినిమాతో ఆడియెన్స్‌ను మెప్పించారు. కథలో ఫస్ట్‌హాఫ్ సరదాగా సాగుతుంది. ఇక సెకెండ్ హాఫ్ మొదలవగానే స్టోరీ ఒక్కసారిగా సీరియస్ మూడ్‌లోకి మారిపోతుంది. 'రంగబలి' సెంటర్ పేరు మార్చడం కోసం శౌర్య చేసే కొన్ని ప్రయత్నాలు థియేటర్లలో నవ్వులు పంచాయి. కానీ మరికొన్ని ప్రయత్నాలు సిల్లీగా అనిపిస్తాయి.
అయితే పేరు మార్చాలనే క్రమంలో హీరోకు ఊరి ఎమ్మెల్యేకు మధ్య వార్ మొదలవ్వడం వల్ల కథ కాస్త రసవత్తరంగా మారుతుంది. అయితే రంగబలి సెంటర్ వెనకున్న అసలు కథ కాస్త రొటీన్‌గానే అనిపించినా, నటుడు శరత్‌కుమార్ వల్ల ఆ ఎపిసోడ్ ప్రేక్షకుల్లో జోష్ నింపుతుంది. ఆ కథను శౌర్య జీవితంతో ముడిపెట్టిన తీరు బాగుంది. చివరగా కాలక్షేపాన్నిచ్చే ‘రంగబలి' అంటూ సినిమా చూసిన ఆడియెన్స్ తమ అభిప్రాయాన్ని తెలుపుతున్నారు.
Rangabali Movie Heroine : పక్కింటి కుర్రాడి పాత్రల్లో నటించడం నాగశౌర్యకు కొత్తేం కాదు. రంగబలిలో కూడా అలాంటి పాత్ర కావడం వల్ల.. శౌర్య తనకున్న అనుభవంతో ఈ పాత్రలో ఇట్టే ఒదిగిపోయారు. యాక్షన్ సన్నివేశాల్లో జోరు చూపించిన శౌర్య.. పలు సీన్స్‌లో తన ఎనర్జీని చూపించి అబ్బురపరిచారు. సహజ పాత్రలో హీరోయిన్ యుక్తి న్యాచురల్‌గా కనిపించింది. కానీ వీరిద్దరి మధ్య లవ్ ట్రాక్ రొటీన్‌గా అనిపించింది. కానీ ద్వితీయార్ధంలో వచ్చే ఓ రొమాంటిక్ పాటలో యుక్తి.. గ్లామర్ బాగానే ఒలికించింది. ఎదుటివాడు సంతోషపడితే తట్టుకోలేని అగాధం అనే పాత్రలో సత్య నటన కడుపుబ్బా నవ్విస్తుంది. ఒకరకంగా ఫస్ట్ హాఫ్‌లో తనే హీరో. అలాగే జాకెట్లు కుట్టే టైలర్ రాజ్‌కుమార్ పాత్ర కూడా అక్కడక్కడా నవ్వులు పూయిస్తుంది.