Randeep Hooda Wedding : ప్రముఖ బాలీవుడ్ నటుడు రణ్‌దీప్ హుడా పెళ్లిపీటలెక్కనున్నారు. 47 ఏళ్ల వయసులో తన ప్రియురాలు లిన్ లైస్రామ్‌ను మరికొద్ది రోజుల్లో పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ మేరకు తన పెళ్లి విషయాన్ని తెలియజేస్తూ రణ్‌దీప్ హుడా తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఈ నెల 29న తమ వివాహం జరగనుందని వెల్లడించారు.
Randeep Hooda Getting Married : 'మహాభారతంలో అర్జునుడు ఎక్కడ మణిపుర్ యువరాణి చిత్రాంగదను వివాహం చేసుకున్నారో.. అక్కడే కుటుంబసభ్యులు, సన్నిహితులు సమక్షంలో మేము ఒక్కటి కాబోతున్నాం. ఈ నెల 29న ఇంఫాల్‌లో మా వివాహం జరగనుంది. త్వరలోనే ముంబయిలో పెళ్లి విందు ఏర్పాటు చేయనున్నాం. మా ప్రయాణానికి మీ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం' అని ఆ పోస్టులో పేర్కొన్నారు. దీంతో ఈ పోస్ట్ కాస్త నెట్టింట్లో వైరల్‌గా అవుతోంది.
2001లో రిలీజైన 'మన్‌సూన్ వెడ్డింగ్'తో తెరంగేట్రం చేశారు రణ్‌దీప్ హుడా. 'రిస్క్', 'కర్మ ఔర్ హోలీ', 'కాక్‌టైల్', 'జిస్మ్ 2', 'బాంబే టాకీస్', 'కిక్', 'భాగి 2', 'రాధే' వంటి సినిమాల్లో రణ్‌బీర్ నటించారు. ప్రస్తుతం ఆయన తన తదుపరి చిత్రం 'స్వతంత్ర వీర్ సావర్కర్' చిత్రంలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా స్వాతంత్య్ర పోరాట యోధుడు వినాయక్ దామోదర్ సావర్కర్ బయోపిక్‌గా రూపొందుతోంది. ఈ సినిమాతోనే రణ్‌దీప్ హుడా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. వహించారు. ఉత్కర్ష్ నైథానితో కలిసి ఈ సినిమాకు కో రైటర్‌గానూ వ్యవహరించారు.