తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

Bramhastra: రణ్​బీర్​, అలియా రెమ్యునరేషన్​పై డైరెక్టర్​ క్లారిటీ.. ఎంతంటే?​ - Bramhastra movie budget

ఫాంటసీ అడ్వెంచర్‌ చిత్రం 'బ్రహ్మాస్త్ర' ఇటీవలే విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. మరి ఈ చిత్రంలో హీరోహీరోయిన్లుగా నటించిన రణ్​బీర్​, అలియా రెమ్యునరేషన్​ ఎంతో తెలుసా?

ranbir alia
రణ్​బీర్ ఆలియా

By

Published : Sep 23, 2022, 3:15 PM IST

రణ్‌బీర్‌ కపూర్‌, అలియాభట్‌ కలిసి నటించిన భారీ బడ్జెట్​ చిత్రం 'బ్రహ్మాస్త్ర'. సెప్టెంబర్‌ 9న విడుదలైన ఈ చిత్రం విజయాన్ని అందుకుంది. అయితే.. ఈ సినిమా బడ్జెట్‌, కలెక్షన్స్‌ విషయంలో రకరకాల రూమర్స్‌ వినిపిస్తున్నాయి. సినిమా బడ్జెట్‌ పెరిగిపోవడం వల్ల.. అలియా, రణ్‌బీర్‌ ఇద్దరూ వారి పారితోషికాలను వదులుకున్నారనే వార్త కూడా ప్రచారం సాగింది. ఈ నేపథ్యంలో దీనిపై స్పందించారు దర్శకుడు అయాన్‌.

''చాలా మంది వ్యక్తిగత త్యాగాల వల్ల ఈ చిత్రాన్ని నిర్మించాం. ఈ సినిమాలో నటించినందుకు రణ్‌బీర్‌ డబ్బులు తీసుకోలేదు. ఇది చాలా పెద్ద విషయం. ఇక అలియా విషయానికొస్తే తను ఈ ప్రాజెక్టులో 2014లో జాయిన్‌ అయ్యింది. అలియాకు ఈ సినిమా కోసం ఇచ్చిన పారితోషికం తను ఇప్పుడు తీసుకుంటున్న దానికి చాలా తక్కువ. మేము ఈ సినిమా పూర్తి చేసే సమయానికి అలియా కూడా ఈ సినిమా నిర్మాణంలో భాగమైంది'' అని అన్నారు. ఇక రణ్‌బీర్‌ కపూర్ మాట్లాడుతూ..''నేను బ్రహ్మాస్త్ర మొదటి భాగానికి పారితోషికం తీసుకోలేదు. కానీ నేను అంతకు మించి పొందాను. ఒక నటుడిగా నేను ఈ సినిమా నుంచి చాలా నేర్చుకున్నాను'' అని అన్నారు. కాగా, ఈ సినిమా నిర్మాతల్లో రణ్‌బీర్‌ కపూర్‌ కూడా ఒకరు. అయాన్‌ ముఖర్జీ దర్శకుడు. అమితాబ్‌ బచ్చన్‌, నాగార్జున, మౌనిరాయ్‌ కీలక పాత్రల్లో నటించారు.

ఇదీ చూడండి: షారుఖ్​ 'జవాన్​'లో మరో స్టార్​ హీరో? ఫ్యాన్స్​కు పండగే!

ABOUT THE AUTHOR

...view details