తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

అవకాశం వస్తే.. పాకిస్థాన్​ చిత్రాల్లోనూ నటిస్తా: స్టార్‌ హీరో - The Legend of Maula Jatt pak movie

అవకాశం వస్తే పాకిస్థాన్​ చిత్రాల్లోనూ నటించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు బాలీవుడ్ స్టార్ హీరో రణ్​బీర్​ కపూర్​. ఇంకా ఏమన్నారంటే..

Ranbir kapoor about pakisthan films
అవకాశం వస్తే.. పాకిస్థాన్​ చిత్రాల్లోనూ నటిస్తా: స్టార్‌ హీరో

By

Published : Dec 13, 2022, 3:31 PM IST

బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్‌ కపూర్‌ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. అయితే ఆయన తాజాగా చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఇతర దేశాల నటీనటులతో పనిచేయడమంటే తనకు ఆసక్తి అని చెప్పిన ఆయన.. అలాగే పాకిస్థాన్‌ చిత్రాల్లో నటించే అవకాశం వస్తే నటిస్తారా..? అనే ప్రశ్నకు తనదైన శైలిలో సమాధానమిచ్చారు. ఇటీవల జరిగిన రెడ్‌ సీ ఇంటరన్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో పాల్గొని.. వెరైటీ ఇంటర్నేషనల్‌ వాన్‌గార్డ్‌ యాక్టర్‌ అవార్డును అందుకున్న రణ్​వీర్​ ఈ వ్యాఖ్యలు చేశారు.

'కళకు, కళాకారులకు సరిహద్దులు ఉండవు. ప్రస్తుతం నేను సౌదీ అరేబియాలో ఉన్నాను. ఈ దేశ పరిశ్రమలతోనూ పనిచేయాలని అనుకుంటున్నాను. కావాలంటే ఇప్పుడే ఓ చిత్రానికి సైన్‌ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. అవకాశం ఇస్తే పాకిస్థాన్‌ చిత్రబృందంతో పనిచేయడానికి కూడా నేను ఇష్టపడతాను. సౌదీ వేదికగా మనం సినిమాలు చేయొచ్చు. అక్టోబర్‌లో విడుదలైన ది లెజెండ్‌ ఆఫ్‌ మౌలా జట్‌(The Legend of Maula Jatt) అనే పాకిస్థాన్‌ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ మధ్య కాలంలో బిగ్గెస్ట్‌ హిట్‌లలో ఈ సినిమా ఒకటి. ఫవాద్‌ ఖాన్‌, మహిరా ఖాన్‌ ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ ఇద్దరూ గతంలో భారతీయ చిత్రాల్లోనూ నటించారు' అని రణబీర్‌ కపూర్‌ అన్నాడు.

కాగా ఈ స్టార్‌ యాక్టర్‌ చివరిగా అయాన్‌ ముఖర్జీ దర్శకత్వం వహించిన 'బ్రహ్మస్త్ర'లో శివ పాత్రతో మెప్పించారు. ప్రస్తుతం సందీప్‌ రెడ్డి యానిమల్‌ చిత్రంలో నటిస్తున్నారు.

ఇదీ చూడండి:ఈ చిన్నారి ఇప్పుడు క్రేజీ హీరోయిన్​ ఇవాళ పుట్టినరోజు కూడా గుర్తుపట్టగలరా

ABOUT THE AUTHOR

...view details