తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

మనాలీలో రణ్​బీర్​తో రష్మిక.. షాహిద్ 'జెర్సీ'పై నాని కామెంట్ - ranbir kapoor rashmika mandanna

Ranbir Kapoor Rashmika Mandanna: కొత్త సినిమాల అప్డేట్లు వచ్చేశాయి. రణ్​బీర్​ కపూర్​-రష్మిక కాంబినేషన్​లో రానున్న కొత్త సినిమా, కార్తికేయ నూతన చిత్రం సహా పలు విశేషాలు ఇందులో ఉన్నాయి. ఇక షాహిద్ కపూర్ నటించిన హిందీ 'జెర్సీ'పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు హీరో నాని.

Ranbir Kapoor Rashmika Mandanna
jersey movie review

By

Published : Apr 22, 2022, 1:42 PM IST

Ranbir Kapoor Rashmika Mandanna: సందీప్​ రెడ్డి వంగ దర్శకత్వంలో బాలీవుడ్ సూపర్​స్టార్ రణ్​బీర్ కపూర్ నటిస్తున్న చిత్రం 'యానిమల్'. రష్మిక హీరోయిన్. ఈ సినిమా చిత్రీకరణ నేడు (శుక్రవారం) హిమాచల్​ ప్రదేశ్​లోని మనాలీలో ప్రారంభమైంది. దీనిని భూషణ్​కుమార్, కిషన్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగ, మురాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ క్రైమ్​ డ్రామాను 2023 ఆగస్టు 23న విడుదల చేయనున్నారు.

మనాలీలో రణ్​బీర్-రష్మిక

Nani on Shahid Kapoor: బాలీవుడ్​ హీరో షాహిద్‌ కపూర్‌ కథానాయకుడిగా తెరకెక్కిన 'జెర్సీ'పై ప్రశంసలు కురిపించారు హీరో నాని. సినిమా మరోసారి సిక్సర్​ కొట్టిందంటూ ట్విట్టర్​ వేదికగా కొనియాడారు. శుక్రవారమే (ఏప్రిల్ 22) విడుదలైన ఈ చిత్రంపై ఇప్పటికే ప్రేక్షకులు సహా క్రిటిక్స్​ మంచి రివ్యూలు ఇస్తున్నారు.

'జెర్సీ'

"'జెర్సీ' చూశాను. గౌతమ్ మరోసారి సిక్సర్ కొట్టాడు. సినిమాలోని నటీనటులు మనసు పెట్టి పనిచేశారు. షాహిద్, మృనాల్, మా అబ్బాయి రోనిత్​ అదరగొట్టారు. చాలా మంచి సినిమా. శుభాకాంక్షలు." అని నాని ట్వీట్ చేశారు.

తెలుగులో ఘన విజయం అందుకున్న నాని 'జెర్సీ'కి రీమేక్‌గా ఈ చిత్రం రూపొందింది. నాని పాత్రలో షాహిద్‌ నటించారు. మృణాల్‌ ఠాకూర్‌ కథానాయిక. మాతృకను తెరకెక్కించిన గౌతమ్‌ తిన్ననూరినే ఈ రీమేక్‌కు దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని దిల్‌రాజు, సూర్యదేవర నాగవంశీ, అమన్‌ నిర్మించారు. అల్లు అరవింద్‌ సమర్పిస్తున్నారు. సచిత్‌- పరంపర సంగీతం అందించారు.

F3: ఎఫ్‌3 'అహ..అహ..' పాట: వెంకటేష్‌, వరుణ్‌తేజ్‌ కథానాయకులుగా ఈ వేసవిలో రానున్న చిత్రం 'ఎఫ్‌3'. ఈ సినిమాలోని 'ఊ...ఆ.. అహ...అహ..' అంటూ సాగే లిరికల్‌ సాంగ్‌ని చిత్ర బృందం విడుదల చేసింది. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో 'ఎఫ్‌2'కి కొనసాగింపుగా వస్తోన్న ఈ సినిమాలో సమ్మర్‌ సోగ్గాళ్ల సరసన తమన్నా, మెహ్రీన్‌ కథానాయికలుగా నటించారు. మే 27న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్‌ సంగీతం అందించారు.

నవ్వులు పూయించడానికి సిద్ధమైన 'ఆర్‌ఎక్స్‌100' హీరో..:'ఆర్‌ఎక్స్‌100'తో యూత్‌కి ఎంతగానో దగ్గరయ్యారు హీరో కార్తికేయ. ఇప్పుడు తన కొత్త సినిమాతో నవ్వులు పూయించడానికి సిద్ధమయ్యారు. తన తర్వాతి సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమం ఈరోజు ఘనంగా జరిగింది. కార్తిక్‌ భార్య లోహిత కెమెరా స్విచ్‌ ఆన్‌ చేయగా, నాగవంశీ క్లాప్‌ కొట్టారు. ఈ సినిమాకి మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించనున్నారు. క్లాక్స్‌ దర్శకత్వంలో వస్తోన్న ఈ చిత్రాన్ని బెన్ని ముప్పనేని నిర్మిస్తున్నారు. కార్తిక్‌ సరసన 'డీజే టిల్లు' భామ నేహాశెట్టి నటిస్తోంది.

కార్తికేయ, నేహా శెట్టి
.
.

ఇదీ చూడండి:'ఆచార్య'లో మహేశ్‌ కూడా.. థ్యాంక్స్​ చెబుతూ చిరు ట్వీట్‌

ABOUT THE AUTHOR

...view details