Aliabhatt Ranbirkapoor: ఇటీవలే హీరోయిన్ ఆలియాభట్‌ను పెళ్లాడి వివాహ జీవితంలోకి అడుగుపెట్టిన బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన మొదటి భార్య కోసం ఇంకా ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు. 'బ్రహ్మాస్త్ర', 'షంషేరా' చిత్రాల ప్రమోషన్స్‌లో పాల్గొన్న ఆయన ఈ విషయాన్ని చెప్పారు.
కొత్త పెళ్లికొడుకు రణ్‌బీర్ కపూర్ సినిమాలతో యమ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం అతడు నటించిన బ్రహ్మాస్త్ర, షంషేరా సినిమాలు త్వరలో రిలీజ్ అవుతుండటంతో ప్రమోషన్ల స్పీడు పెంచాడీ హీరో. ఈ క్రమంలో తన మొదటి భార్య ఆలియా కాదంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
"కొన్నాళ్ల క్రితం జరిగిన ఓ సంఘటన చాలా క్రేజీగా అనిపించింది. గతంలో ఓ అమ్మాయి మా బంగలా దగ్గరకు వచ్చి మా ఇంటి గేట్‌ను పెళ్లాడింది. నేను ఇంటికి రాగానే మా వాచ్మెన్ ఈ విషయాన్ని చెప్పాడు. గేటుకు పూలదండ వేసి కుంకుమ బొట్టు పెట్టి, పువ్వులు చల్లి.. ఇక నాకు తనకూ పెళ్లి అయిపోయింది అనుకుని వెళ్లిపోయింది. ఆమెను ఇంకా కలవలేదు. తనను కలవాల్సి ఉంది." అని రణ్‌బీర్ అన్నారు.
కాగా, ఈ ఏడాది ఏప్రిల్‌లో ఆలియా భట్‌ను సమీప బంధుమిత్రుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు రణ్‌బీర్. వీరిద్దరూ కలిసి నటించిన 'బ్రహ్మస్త్రం'.. సెప్టెంబర్ 9న విడుదలకానుంది. ఇక రణ్‌బీర్, వాణీకపూర్, సంజయ్ దత్ ప్రధాన పాత్రల్లో మెరిసిన 'షంషేరా' జులై 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. చివరగా 2018లో వచ్చిన 'సంజు' చిత్రంలో అలరించారు రణ్‌బీర్. 'గంగూబాయ్', 'ఆర్ఆర్ఆర్'తో అభిమానులను పలకరించిన ఆలియా ప్రస్తుతం హాలీవుడ్లో చిత్రం 'హార్ట్ ఆఫ్ స్టోన్'లో నటిస్తోంది.
ఇదీ చూడండి: ప్రభాస్, చిరంజీవితో సినిమా.. మలయాళ స్టార్ పృథ్వీరాజ్ రియాక్షన్ ఇదే!