తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

రణ్​బీర్​ వైలెంట్​ లుక్​ - సందీప్​ మాస్టర్​ ప్లాన్​ - 'యానిమల్'​లో అదే హైలైట్​! - రణ్​బీర్​ కపూర్​ యానిమల్ మూవీ డైరెక్టర్

Ranbir Kapoor Animal Movie : బాలీవుడ్ స్టార్​ హీరో రణ్​బీర్ కపూర్ సందీప్​ రెడ్డి కాంబోలో వస్తున్న లేటెస్ట్​ మూవీ 'యానిమల్​'. భారీ అంచనాల నడుమ ఈ సినిమా డిసెంబర్​ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు మీ కోసం..

Ranbir Kapoor Animal Movie
Ranbir Kapoor Animal Movie

By ETV Bharat Telugu Team

Published : Nov 10, 2023, 6:46 AM IST

Ranbir Kapoor Animal Movie :'అర్జున్ రెడ్డి' సినిమాతో యావత్​ సినీ ఇండస్ట్రీని తనవైపుకు తిప్పుకున్నారు డైరెక్టర్​ సందీప్​ రెడ్డి వంగ. భారీ అంచనాల నడుమ వచ్చిన ఈ చిత్రం అప్పట్లో యూత్​ను ఆకట్టుకోవడమే కాకుండా.. విజయ్​ కెరీర్​లో బిగ్గెస్ట్​ హిట్​గా నిలిచింది. దీంతో అటు విజయ్​తో పాటు ఇటు సందీప్​ పేరు ఇండస్ట్రీలో మారుమోగిపోయింది. ఇక ఇదే సినిమాను హిందీలో 'కబీర్​ సింగ్​'గా తెరకెక్కించి అక్కడ కూడా తన సత్తా చాటారు. అయితే తమిళంలో కూడా అతనికి రీమేక్ చేసే ఆఫర్ వచ్చింది కాని దాన్ని ఆయన చేయలేదు. దీంతో తన నెక్స్ట్​ ప్రాజెక్ట్ 'యానిమల్' ​పై అభిమానుల్లో ఆసక్తి పెరిగింది.

తన మూడో సినిమా​ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్న సందీప్​.. దీన్ని పాన్​ ఇండియా లెవెల్​లో తెరకెక్కించేందుకు ప్లాన్ చేశారు. హీరో రణ్​బీర్​ కపూర్​, రష్మిక మందన్న, అనిల్​ కపూర్, బాబీ దేవోల్​​ లాంటి భారీ తారాగణాన్ని రంగంలోకి దింపారు. దీంతో ఇప్పటి వరకు సాప్ట్​ రోల్స్​ చేస్తూ వచ్చిన రణ్​బీర్​..కాస్త వైలెంట్​ మోడ్​లోకి మారిపోయారు. దీంతో ఈ కాంబోపై ఓ రేంజ్​లో అంచనాలు పెరిగిపోయాయి. ఫస్ట్ లుక్​ పోస్టర్స్​ నుంచి టీజర్​ వరకు అన్నింటినీ ఎక్స్​ట్రాడనరీగా రూపొదించారు. అభిమానుల్లో ఈ అప్​డేట్స్​కు పాజిటివ్​ రెస్పాన్స్​ వచ్చింది. దీంతో మేకర్స్​ కూడా ఎప్పటికప్పుడు ఏదో ఒక అప్​డేట్​​తో సినిమాకు ఉన్న బజ్ తగ్గకుండా జాగ్రత్త పడుతున్నారు.

మరో ముఖ్యమైన అంశం ఏంటంటే.. ఈ సినిమా ద్వారా అటు హీరోతో పాటు ఇటు డైరెక్టర్ లాభపడే అవకాశాలున్నాయని టాక్​ నడుస్తోంది. తన తొలి సినిమా లవ్ స్టోరీ అయినప్పటికీ.. హీరోను ఎలివేట్​ చేసే విషయంలో ఏ మాత్రం తగ్గలేదు సందీప్​. 'అర్జున్​ రెడ్డి' పాత్రను చాలా పవర్​ఫుల్​గా చూపించిన ఆయన​..​ ఇప్పుడు రణబీర్ కపూర్ పాత్రను అంతకుమించి చూపించనున్నట్లు టీజర్ ద్వారా తెలుస్తోంది. పూర్తి వైలెన్స్​ మోడ్​లో ఉన్నప్పటికీ.. ఈ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్​తో పాటు లవ్​ ఎలిమెంట్స్​​ ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో ఫైట్​ సీన్స్​ హైలైట్​గా నిలవనుందని టాక్​ నడుస్తోంది. ముఖ్యంగా హోటల్ లాబీలో మాస్క్​ వేసుకున్న మనుషులతో రణ్​బీర్​ చేసే ఫైట్​ పూర్తి వైలెంట్​ మోడ్​లో ఉండనుందని సమచారం.

మరోవైపు సందీప్ గురించి రణ్​బీర్ కపూర్ తన ప్రతి ఇంటర్వ్యూలో ఏదో ఒక కొత్త విషయాన్ని చెబుతూనే ఉన్నారు. ఇక సందీప్ కూడా హీరో యాక్టింగ్ స్కిల్స్ గురించి పలు కొత్త విషయాలు చెప్పుకొచ్చారు. దీంతో డైరెక్టర్ హీరోకు పర్ఫెక్ట్ కెమిస్ట్రీ ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఇది ఇలాగే కొనసాగితే.. సినిమాలో ఏదైనా సరే వర్కౌట్ అవుతుందని విశ్లేషకుల అభిప్రాయం.

ఇక సందీప్ కూడా ఈ సినిమాతో సక్సెస్​ అందుకుని బాలీవుడ్​లోనూ బిజీగా మారాలని చూస్తున్నారు. రణ్​బీర్​ కపూర్ కూడా సౌత్ ఇండస్ట్రీ మార్కెట్​పై కూడా పట్టు సాధించాలనే ప్లాన్​లో ఉన్నారు. మరి ఈ సినిమా ఎటువంటి రిజల్ట్స్​ ఇస్తుందో వేచి చూడాల్సిందే.

'యానిమల్​' డైరెక్టర్​ నిర్ణయంతో తలలు పట్టుకుంటున్న థియేటర్స్​ యజమానులు!

Ranbir kapoor Movie Break : రణ్​​బీర్ షాకింగ్ డెసిషన్.. సినిమాలకు బ్రేక్.. ఆమె కోసమే!

ABOUT THE AUTHOR

...view details