తెలంగాణ

telangana

By

Published : Apr 14, 2022, 5:48 PM IST

Updated : Apr 14, 2022, 10:58 PM IST

ETV Bharat / entertainment

వివాహ బంధంతో ఒక్కటైన ఆలియా భట్​ -రణ్​బీర్ కపూర్​​

బాలీవుడ్​ లవ్​బర్డ్స్​ ఆలియా భట్‌-రణ్‌బీర్‌ కపూర్‌ దంపతులుగా మారారు. పంజాబ్​ సంప్రదాయం ప్రకారం జరిగిన పెళ్లితో.. ఇద్దరు వివాహ బంధంలోకి అడుగు పెట్టారు.

ranbir-kapoor-and-alia
ఆలియా భట్​ -రణ్​బీర్

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మోస్ట్​ క్రషింగ్​ పెయిర్​ ఆలియా భట్‌-రణ్‌బీర్‌ కపూర్‌ పెళ్లి తంతు ముగిసింది. దీంతో ఇన్నాళ్లు లవ్‌బర్ట్స్‌గా ఉన్న ఈ జంట.. పెళ్లితో దంపతులుగా మారారు. పంజాబ్​ సంప్రదాయం ప్రకారం.. ఈ వివాహం జరిగింది. బాంద్రాలోని వాస్తు అపార్ట్‌మెంట్‌లో జరిగిన ఈ పెళ్లికి అతి తక్కువమంది కుటుంబసభ్యులు, స్నేహితులు, బాలీవుడ్​ ప్రముఖులు మాత్రమే హాజరు హాజరయ్యారు. ఆలియా తల్లిదండ్రులు, రణ్‌బీర్‌ కుటుంబసభ్యులు దగ్గరుండి పెళ్లి పనులను చూసుకుంటున్నారు.

ఆలియా భట్​ -రణ్​బీర్
ఆలియాను ముద్దు పెట్టుకుంటున్న రణ్​బీర్​
ఆలియా భట్​ -రణ్​బీర్
రణ్​బీర్​కు ఆలియా ముద్దు

తమ జీవితాల్లో స్పెషల్‌గా చెప్పుకునే పెళ్లి వేడుకలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా రణ్‌బీర్‌-ఆలియా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నారు. అందులో భాగంగా పెళ్లి వేదిక వద్ద విధులు నిర్వర్తించనున్న సెక్యూరిటీ సిబ్బంది సెల్‌ఫోన్‌ కెమెరాలకు స్టిక్కర్లు అతికించారు. ఇక ఈ రోజు రాత్రి 7 గంటల సమయంలో తమ పెళ్లి తొలి ఫొటోని సోషల్‌మీడియాలో ఆలియా-రణ్‌బీర్‌ పంచుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇదీ చదవండి: ' 'ఆర్​ఆర్​ఆర్' కంటే 'కేజీఎఫ్-2' 10రెట్లు చెత్త సినిమా ​'​

Last Updated : Apr 14, 2022, 10:58 PM IST

ABOUT THE AUTHOR

...view details