తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

భారీ విజువల్​ వండర్​గా రణ్​బీర్​ 'బ్రహ్మాస్త్ర' ట్రైలర్​ - అదిరిపోయిన రణ్​బీర్​ బ్రహ్మస్త్రం ట్రైలర్​

Ranbir Bramhastram trailer: అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'బ్రహ్మాస్త్రం' ట్రైలర్​ విడుదలైంది. ఈ ప్రచార చిత్రం ఆద్యంతం ఆకట్టుకుంటోంది. సినిమాపై భారీగా అంచనాలను పెంచుతోంది.

bramhastram trailer
బ్రహ్మస్త్రం ట్రైలర్​

By

Published : Jun 15, 2022, 9:28 AM IST

Updated : Jun 15, 2022, 12:01 PM IST

Ranbir Bramhastram trailer: "అగ్నితో నాకో బంధం ఉంది. అది నన్ను దహించలేదు. ఈ ప్రపంచంలో ఏదో జరగుతోంది. ఇక్కడ కొన్ని పురాతన శక్తులు ఉన్నాయి. వాటిని కాపాడేందుకు రక్షకులు ఉన్నారు. కానీ ఓ అంధకారం కూడా ఉంది. అది అందర్నీ భస్మం చేసేస్తుంది" అని అంటున్నారు రణ్​బీర్. హీరోయిన్​ ఆలియాభట్​తో కలిసి​ ఆయన​ శివగా ఓ పవర్​ఫుల్​ రోల్​లో నటిస్తున్న సినిమా 'బ్రహ్మాస్త్ర'. అభిమానులు ఎంతో కాలంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్ర ట్రైలర్​ తాజాగా తెలుగు, హిందీలో విడుదలైంది. తెలుగులో మెగాస్టార్​ చిరంజీవి వాయిస్​ ఓవర్​ ఇవ్వగా.. హిందీలో బిగ్​బీ ఇచ్చారు.

"నీరు, గాలి, నిప్పు.. కొన్ని వేల సంవత్సరాలుగా కొన్ని అస్త్రాలలో ఇమిడి ఉన్నాయి. ఈ కథ అస్త్రాలన్నింటికీ అధిపతి అయిన 'బ్రహ్మాస్త్ర'ది. ఆ 'బ్రహ్మాస్త్ర' విధి తన అరచేతి రేఖలలో చిక్కుకుని అందని ఆ యువకుడి తెలియదు. అతడే శివ." అంటూ మెగాస్టార్​ వాయిస్​ ఓవర్​తో ప్రారంభమైన ఈ చిత్ర ట్రైలర్​ ఆద్యంతం అదిరిపోయే సన్నివేశాలతో ఆకట్టుకుంటోంది. ఇందులో మన టాలీవుడ్​ అగ్ర హీరో నాగార్జున ​శివుడి వాహనం నందిగా పవర్​ఫుల్​గా కనిపిస్తున్నారు. 'హే నంది అస్త్రం'.. అంటూ నాగ్​.. 'మనకున్న ఏకైక లక్ష్యం 'బ్రహ్మాస్త్రం'... అంటూ మౌనీరాయ్​ ఓ శక్తిమంతమైన విలన్​గా.. "మా ఈ అస్త్రాల ప్రపంచంతో నీ జీవితం ముడిపడి ఉంది. ఎందుకంటే నువ్వు కూడా ఓ అస్త్రానివి. అగ్ని అస్త్రానివి".. అంటూ రణ్​బీర్​తో బిగ్​బీ చెప్పే సంభాషణలు అదిరిపోయాయి. ఇక ఆలియాగాఇషా-శివగా రణ్​బీర్​ ప్రేమాయణం మెప్పించేలా సాగింది. చివరిగా 'ది పవర్​ ఆఫ్ లవ్​, లైట్​, ఫైర్.. బ్రహ్మాస్త్ర' అంటూ ప్రచార చిత్రం​ ముగిసింది.

మొత్తంగా ఆకట్టుకుంటున్న ఈ ప్రచార చిత్రం.. సినిమాపై భారీగా అంచనాలను పెంచింది. దీన్ని దర్శకుడు అయాన్‌ ముఖర్జీ తెరకెక్కించారు. సుమారు రూ.400 కోట్లకు పైగా బడ్జెట్‌తో రూపుదిద్దుకున్న ఈ ప్రతిష్ఠాత్మకమైన సినిమా.. వివిధ అస్త్రాల విశిష్ఠతను తెలియజేసే కథాంశంతో తెరకెక్కింది. సెప్టెంబరు 9 ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ విడుదల కానుంది.

ఇదీ చూడండి: 'జబర్దస్త్ విషయంలో ఆ తప్పు చేశా.. నా రెమ్యునరేషన్ తెలియగానే వారంతా షాక్!'

Last Updated : Jun 15, 2022, 12:01 PM IST

ABOUT THE AUTHOR

...view details