తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

11 ఏళ్లకే స్టార్​ హీరోతో ప్రేమలో పడ్డ నటి​.. త్వరలోనే పెళ్లి!

చిత్రసీమలో పలువురు హీరోహీరోయిన్లు నిజజీవితంలో ప్రేమలో పడటం సహజమే. అయితే ఆ ప్రేమ కథలు పెళ్లి వరకు వెళ్లిన సంఘటనలు చాలా అరుదనే చెప్పాలి.​ కానీ ఓ స్టార్​ హీరోయిన్ మాత్రం తన 11వ ఏటనే తనకన్నా పదేళ్లు పెద్దవాడైన ఓ స్టార్​ హీరోతో ప్రేమలో పడి.. ప్రస్తుతం ఆయన్నే పెళ్లి చేసుకోబోతుంది. ఇంతకీ ఆ జంట ఎవరంటే?

Alia Ranbir kapoor marriage
Alia Ranbir kapoor marriage

By

Published : Apr 7, 2022, 8:16 AM IST

Updated : Apr 7, 2022, 9:19 AM IST

Ranbir kapoor Alia bhatt Marriage: బాలీవుడ్ లవ్​బర్డ్స్​ రణ్​బీర్​ కపూర్​- ఆలియా భట్​.. పరిస్థితి అంతా బాగుండి ఉంటే ఇప్పటికే పెళ్లి పీటలెక్కాల్సింది. కానీ కరోనా సహా ఇతర కారణాల వల్ల ఈ జంట వివాహ వేడుక వాయిదా పడుతూ వస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి వీరి పెళ్లి తెరపైకి వచ్చింది. ఈ నెల 17న ఏడడుగులు వేయబోతున్నారంటూ ప్రస్తుతం జోరుగా ప్రచారం సాగుతోంది. అతితక్కువ మంది సమక్షంలో ఈ వేడుక జరగనుందట. ఇప్పటికే అతిథుల జాబితాను కూడా రెడీ చేశారని తెలిసింది. ప్రస్తుతం పెళ్లికి సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయట. ముంబయిలోనే వీరు పెళ్లి పీటలెక్కనున్నారని అంతా మాట్లాడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వీరి ప్రేమ ఎలా మొదలైంది? ఎలా సాగింది? వంటి విషయాల గురించి తెలుసుకుందాం..

మొదటినుంచి ఆలియాకు రణ్​బీర్​ కపూర్​ అంటే చాలా ఇష్టమట! తన ఫస్ట్ క్రష్​ కూడా అతడే. ఈ విషయాన్ని ఆలియానే స్వయంగా గతంలో ఓ సందర్భంలో చెప్పింది. ప్రముఖ దర్శకుడు సంజయ్​ లీలా భన్సాలీ దగ్గర రణ్​బీర్​ కపూర్ కొన్ని రోజులు సహాయ దర్శకుడిగా పనిచేశారు. అప్పుడు 'బ్లాక్​' సినిమా ఆడిషన్స్​ జరుగుతున్నాయి. ఆలియా ఆ చిత్రంలో నటించాలని అనుకున్నారు. దీంతో అక్కడికి వెళ్లి ఆడిషన్స్ ఇచ్చారు. ఆ సమయంలోనే అక్కడే ఉన్న రణ్​బీర్​పై క్రష్​ ఫీలింగ్ కలిగిందట. అప్పుడు ఆమె వయసు 11ఏళ్లు కాగా, రణ్​బీర్ ఆమె కంటే పదేళ్లు పెద్ద.

అయితే ఆలియాకు రణ్​బీర్ ఫస్ట్ క్రష్​ అయినప్పటికీ.. అతడి ఫస్ట్ క్రష్​ మాత్రం ఆమె కాదు. ఆలియా కన్నా ముందు దీపికా పదుకొణె, కత్రినా కైఫ్​ సహా పలువురు హీరోయిన్లతో ఆయన ప్రేమాయణం నడిపారని జోరుగా ప్రచారం సాగింది. ఆ హీరోయిన్లతో ఆలియాకు మంచి పరిచయం కూడా ఉందట. వీరితో బ్రేకప్​ అయ్యాక ఆలియాతో రణ్​బీర్​కు మంచి స్నేహం ఏర్పడింది.

'బ్రహ్మాస్త్ర' సినిమా షూటింగ్​లో సమయంలో వీరి​ స్నేహం మరింత దగ్గరైంది. అలా ఈ జంట మధ్య ప్రేమకు పునాది పడింది. అప్పటి నుంచి వీరు పలు చోట్ల షికార్లు కొడుతూ కెమెరా కంటికి చిక్కి వార్తల్లో నిలిచారు. అనంతరం పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు.

రణ్​బీర్ ఆలియా

ఇదీ చూడండి:ఈ భామల కాల్షీట్లు ఫుల్​.. ఇక సెట్​లో హీరోలతోనే..

Last Updated : Apr 7, 2022, 9:19 AM IST

ABOUT THE AUTHOR

...view details