తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

ఆలియా, రణ్‌బీర్ పెళ్లికి ఆర్‌కే స్టూడియోస్ ముస్తాబు..! రిసెప్షన్ ఎక్కడంటే? - alia bhatt ranbir kapoor movies

బీ టౌన్‌లో ఇప్పుడు ఏ ఇద్దరు కలిసినా.. రణ్‌బీర్‌ కపూర్, ఆలియా భట్‌ల వివాహం గురించే చర్చ. ఏప్రిల్ 14న వారి పెళ్లి జరగనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో వారి వివాహ ఏర్పాట్లు ఎలా ఉండబోతున్నాయి? సంగీత్, రిసెప్షన్ ఎప్పుడు జరగనున్నాయి?

Ranbir Kapoor Alia Bhatt
రణ్‌బీర్‌ కపూర్, ఆలియా

By

Published : Apr 11, 2022, 6:51 PM IST

Updated : Apr 11, 2022, 10:51 PM IST

Ranbir Kapoor Alia Bhatt wedding: బాలీవుడ్‌ జంట ఆలియాభట్, రణ్‌బీర్ కపూర్ పెళ్లికి ఏర్పాట్లు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఈ ఏడాది అత్యంత క్రేజీగా మారిన ఈ పెళ్లి కోసం ఆర్‌కే స్టూడియోస్, రాజ్ కపూర్ నివాసాన్ని ముస్తాబు చేస్తున్నారు. ఏప్రిల్ 14న పెళ్లి జరగనున్నట్టు వార్తలు వస్తున్నాయి.

28మంది అతిథులు

ఆలియా, రణ్‌బీర్ కపూర్ పెళ్లికి ఆహ్వానితుల జాబితాపై భారీగా చర్చ జరుగుతున్నది. దాదాపు 45 నుంచి 50 మంది అతిథులను ప్రత్యేకంగా ఆహ్వానించినట్టు సమాచారం. అయితే ఆలియా సోదరుడు రాహుల్ భట్ మాత్రం కేవలం 28 మందిని మాత్రమే ఆహ్వానిస్తున్నట్పు చెప్పడం గమనార్హం. ఇరు కుటుంబాలకు సంబంధించిన వారితో పాటు కరణ్ జోహర్, ఆయన్ ముఖర్జీ తదితరులు అతిథుల జాబితాలో ఉన్నట్లు సమాచారం. మెహందీ, సంగీత్, హల్దీ వేడుకలను చెంబూర్‌లోని ఆర్కే హౌస్‌లో నిర్వహించే అవకాశం ఉంది. సంగీత్ వేడుక కోసం భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు.

ఆలియా భట్, రణ్‌బీర్ పెళ్లి కోసం డిజైనర్ దుస్తులు కూడా సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఆలియాభట్ కోసం సవ్యసాచి డిజైన్ చేస్తున్నారు. అలాగే మనీష్ మల్హోత్రా కూడా కొన్ని దుస్తులు సిద్దం చేసినట్టు సమాచారం. ఆలియా కోసం మనీష్ ప్రత్యేకంగా లహెంగా, దుపట్టా డిజైన్ చేశారట. ఈ డిజైనర్ దుస్తుల ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

రిసెప్షన్ ఎక్కడంటే?

పెళ్లి తర్వాత దేశవ్యాప్తంగా ఉన్న సినీ, రాజకీయ, వ్యాపార వర్గాలకు భారీగా విందును రణ్‌బీర్, ఆలియా భట్ ఏర్పాటు చేసే అవకాశం ఉందట. ఈ విందు కోసం ముంబైలోని తాజ్ మహల్ ప్యాలెస్‌ సిద్దమవుతున్నది. ఆలియా, రణ్‌బీర్ రిసెప్షన్ ఏప్రిల్ 17వ తేదీన జరుగుతుందని సన్నిహితులు చెబుతున్నారు.

ఇదీ చూడండి: అందుకే మీడియాకు దూరంగా ఉంటున్నా: విజయ్​

Last Updated : Apr 11, 2022, 10:51 PM IST

ABOUT THE AUTHOR

...view details