ఎట్టకేలకు బాలీవడ్ లవ్‌బర్డ్స్ రణ్‌బీర్ కపూర్- ఆలియా భట్ పెళ్లిపై క్లారిటీ వచ్చేసింది. గురువారం పెళ్లి జరగనున్నట్లు రణ్‌బీర్ సోదరి రిద్ధిమా కపూర్ సావ్నే వెల్లడించారు. బుధవారం మెహందీ వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా హాజరైన మీడియాకు రిద్ధిమా కపూర్.. పెళ్లిపై స్పష్టత ఇచ్చారు.
" రణ్‌బీర్ బాంద్రా నివాసంలో పెళ్లి జరుగుతుంది. ఆలియా చాలా అందంగా ఉంటుంది"
-రణ్‌బీర్ సోదరి రిద్ధిమా
అమితాబ్ విషెష్
గురువారం పెళ్లి చేసుకోబోతున్న రణ్‌బీర్ కపూర్- ఆలియా భట్ జంటకు బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ శుభాకాంక్షలు చెప్పారు. ఈ సందర్భంగా 'బ్రహ్మాస్త్ర' సినిమాలోని లవ్ సాంగ్ 'కేసరియా' సాంగ్‌ను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. 'భవిష్యత్‌లో చాలా ప్రత్యేకమైన ప్రయాణాన్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతున్న మా ఇషా, శివకు శుభాకాంక్షలు. బ్రహ్మాస్త్ర టీమ్ నుంచి ప్రత్యేక వేడుకలు ప్రారంభిద్దాం' అంటూ ఆ వీడియోకు జోడించారు. 'బ్రహ్మాస్త్ర' చిత్రంలో రణ్‌బీర్ పాత్ర పేరు శివ కాగా.. ఆలియా పాత్ర పేరు ఇషా.
ఇదీ చదవండి: రణ్‌బీర్- ఆలియా పెళ్లికి రాయల్ గిఫ్ట్ - 125 బంగారు పూలతో..