బాలీవుడ్ స్టార్ కపుల్ రణ్‌బీర్ కపూర్, ఆలియాల ముద్దుల తనయ రాహాను ఎప్పుడెప్పుడు చూస్తామన్న అభిమానులకు ఇక కొంతకాలం పాటు నిరీక్షణ తప్పదంటోంది ఆ జంట. ఈ విషయాన్ని శనివారం ముంబయిలో జరిగిన ఓ సమావేశంలో వెల్లడించారు. రాహాకు రెండేళ్లు వచ్చేంతవరకు ఎటువంటి ఫొటోలను పోస్ట్ చేయబోమని ఆలియా, రణ్‌బీర్ తెలిపారు. అంతే కాకుండా ఫొటోగ్రాఫర్లు సైతం బయట వారు కనిపించినప్పుడు ఫొటోలు తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయొద్దని కోరారు. ఈ మీడియా సమావేశానికి రణ్‌బీర్, ఆలియాల కుటుంబసభ్యులు పాల్గొన్నారు.
రణ్‌బీర్, ఆలియా ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్.. పాప ఫొటో విషయంలో ఇంకొంత కాలం సస్పెన్స్ అంట.. - రణ్‌బీర్ కపూర్ ఆలియా ప్రెస్ మీట్
రణ్‌బీర్- ఆలియా ముద్దుల కుమార్తె రాహాను చూసేందుకు ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న అభిమానులకు ఓ షాకింగ్ న్యూస్. పాప ఫొటోను ఇంకొంత కాలం సన్పెన్స్లో ఉంచనున్నట్లు తెలిపారు ఆలియా, రణ్‌బీర్.
alia and ranbir kapoor
కాగా రణ్‌బీర్, ఆలియాల గారాలపట్టి రాహా 2022 నవంబర్ 6న జన్మించింది. అప్పటి నుంచి వీరిద్దరు తన పేరు గురించి తప్ప మరే సమాచారాన్ని బయటపెట్టలేదు. మరోవైపు ఈ ఏడాది రణ్‌బీర్ కాస్త బిజీ అయిపోయారనే చెప్పాలి. లవ్ రంజన్‌తో పాటు సందీప్ రెడ్డి వంగాతో రణ్‌బీర్ సినిమాలు చేస్తున్నారు. ఆలియా సైతం కరణ్‌జోహార్ సినిమా 'రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ'తో బిజీ అయిపోయింది.