Ranbir kapor Aliabhatt marriage: బాలీవుడ్ చాక్లెట్ బాయ్ రణ్బీర్ కపూర్-క్యూట్ గర్ల్ ఆలియా భట్ పెళ్లి గురించి ఓ ఆసక్తికరమైన వార్త రోజుకొకటి బయటకు వస్తూనే ఉంది. ఎప్పటినుంచో వాయిదా పడుతూ వస్తున్న వీరి వివాహం ఎట్టకేలకు ఈ నెల 14న జరగబోతుందని కొద్ది రోజులుగా జోరుగా ప్రచారం సాగింది. కానీ ఇప్పుడు మరోసారి ఈ వేడుక వాయిదా పడిందని తెలిసింది. ఈ విషయాన్ని ఆలియా హాఫ్ బ్రదర్ రాహుల్ చెప్పారు.
రణ్బీర్-ఆలియా పెళ్లి మరోసారి వాయిదా.. కొత్త తేదీ ఇదే! - రణ్బీర్-ఆలియా పెళ్లి మరోసారి వాయిదా
Ranbir kapor Aliabhatt marriage: గత కొద్ది రోజులుగా జోరుగా ప్రచారం సాగుతోన్న రణ్బీర్-ఆలియా భట్ వివాహం మళ్లీ వాయిదా పడిందని తెలిసింది. ఈ విషయాన్ని ఆలియా హాఫ్ బ్రదర్ రాహుల్ చెప్పారు.
.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన ఆలియా-రణ్బీర్ పెళ్లిపై స్పందించారు. "నిజానికి వీరు ఏప్రిల్ 14,15వ తేదీల్లో చేసుకోవాలి అనుకున్నారు. అంతా బాగుండి ఉంటే అనుకున్న తేదీకే జరిగేది. అయితే ఎంత గోప్యత పాటించిన ఇది బయటకు వచ్చింది. దీంతో సెక్యురిటీ దృష్ట్యా మెహందీ, హల్దీ సహా అన్ని వేడుకల తేదీల్లో మార్పులు చేశారు. అలా పెళ్లి తేదీని కూడా మార్చారు. ఏప్రిల్ 20న వీరి వివాహం జరగవచ్చు" అని అన్నారు.
ఇదీ చూడండి: బాప్రే.. ఈ ముద్దుగుమ్మలు అందాలతో అల్లాడిస్తున్నారుగా!