తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'మనం తగ్గి సినిమాను ఎలివేట్​ చేస్తే ఆ కిక్కే వేరు' - విరాటపర్వం సినిమా

రానా కథనాయకుడిగా నటించిన చిత్రం 'విరాటపర్వం'. సాయిపల్లవి కథానాయిక. శనివారం ట్రైలర్​ను విడుదల చేయనున్నట్లు ప్రకటిస్తూ శుక్రవారం మూవీటీమ్​ ఓ పోస్టర్​ను రిలీజ్​ చేసింది. దీనిపై పలువురు ట్రోల్​ చేయగా.. దానికి రానా గట్టి రిప్లై ఇచ్చాడు.

విరాట పర్వం
విరాట పర్వం

By

Published : Jun 3, 2022, 10:47 PM IST

ప్రచారంలో భాగంగా 'విరాటపర్వం' చిత్ర బృందం సోషల్‌ మీడియా వేదికగా ఓ పోస్టర్‌ విడుదల చేసింది. 'జూన్‌ 5న ట్రైలర్‌ విడుదల' అని తెలియజేసే ఫొటో అది. ఇప్పుడిదే ఓ నెటిజన్‌, నటుడు రానా మధ్య చర్చకు దారి తీసింది. ఫొటోలో రానా ఫేస్‌ కట్‌ అవడం ఇందుకు కారణమైంది.

చిత్ర నిర్మాణ సంస్థ సురేశ్‌ ప్రొడక్షన్స్‌ షేర్‌ చేసిన ఆ ఇమేజ్‌ను రీట్వీట్‌ చేస్తూ "సొంత నిర్మాణ సంస్థలోనే ఫేస్‌ కట్‌ చేసేశారు. మిగతా వారు వేలెత్తి చూపడంలో తప్పేముంది. ఆ సినిమాలోనో, ఈ సినిమాలోనో తక్కువ నిడివి ఉన్న పాత్రలు చేయడం, అందరికీ లోకువ అవడం రానా స్టైల్‌" అని ట్విటర్‌ యూజర్‌ ఒకరు వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. దీనిపై రానా స్పందించారు. "మనం తగ్గి.. కథ, నాయికను ఎలివేట్‌ చేయడంలో ఉండే కిక్కే వేరు బ్రదర్‌. సొంత బ్యానర్‌ కదా గొప్పవన్నీ ఇక్కడే చేయొచ్చు" అని రానా సమాధానమిచ్చారు. బాగా చెప్పారంటూ పలువురు నెటిజన్లు, రానా అభిమానులు కామెంట్లు పెట్టారు. 'మిమ్మల్ని అసాధారణమైన పాత్రలో చూడాలనుకుంటున్నాం' అని ఓ అభిమాని కోరగా "తదుపరి చేయబోయేది అలాంటిదే. 'విరాటపర్వం' విడుదల తర్వాత వివరాలు తెలియజేస్తా" అని రానా పేర్కొన్నారు.

రానా, సాయి పల్లవి, ప్రియమణి, నవీన్‌ చంద్ర తదితరులు కలిసి నటించిన ఈ పీరియాడికల్‌ చిత్రాన్ని వేణు ఊడుగుల తెరకెక్కించారు. సురేశ్‌ ప్రొడక్షన్‌, ఎస్‌ఎల్‌వీ సినిమా సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం జూన్‌ 17న విడుదలకానుంది. రానా ఇందులో కామ్రేడ్‌ రవన్నగా, సాయి పల్లవి వెన్నెల అనే పాత్రలో కనిపించనున్నారు.

ఇదీ చూడండి :'మేజర్‌' గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?

ABOUT THE AUTHOR

...view details