తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

బాబాయ్​, అబ్బాయ్​ 'రానా నాయుడు'.. నెట్​ఫ్లిక్స్​లో యాక్షన్​ థ్రిల్లర్​ - రానా వెంటటేశ్​ వెబ్​ సరీస్

Rana Raidu Web Series : రానా, వెంకటేశ్​ తొలిసారి స్క్రీన్ పంచుకున్నారు. వీరిద్దరి కాంబినేషన్​లో వస్తున్న వెబ్​ సిరీస్ 'రానా నాయుడు'. తాజాగా ఈ వెబ్​సిరీస్ టీజర్​ రిలీజ్​ అయింది. యాక్షన్​ థ్రిల్లర్​గా వస్తున్న ఈ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

rana naidu web series
rana naidu web series

By

Published : Sep 24, 2022, 2:03 PM IST

Rana Raidu Web Series : కుటుంబ కథా చిత్రాలతో బాబాయ్​ అలరించారు. మంచి లేడీ ఫ్యాన్స్​ను సంపాదించుకున్నారు. అబ్బాయ్​ మాస్ ఇమేజ్​తో ప్రేక్షకులకు దగ్గరయ్యారు. అయితే బాబాయ్​ వెంకటేష్, అబ్బాయ్​ రానా తొలిసారి స్క్రీన్ పంచుకోబోతున్నారు. రానా నాయుడు అనే శీర్షికతో వస్తున్న వెబ్​ సిరీస్​లో ఇద్దరూ నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం టీజర్​ విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

'రే డోనోవన్' అనే అమెరికన్ క్రైమ్​ డ్రామా సినిమా స్ఫూర్తితో ఈ సిరీస్ తెరకెక్కిస్తున్నారు. ఈ సిరీస్ నెట్​ఫ్లిక్స్​లో విడుదల కాబోతోంది. ముంబయి క్రైం నేపథ్యంలో యాక్షన్​ థ్రిల్లర్​గా ప్రేక్షకులను అలరించనుంది. ఈ ఇద్దరి కలయిలో వస్తున్న వెబ్​సిరీస్ ఆభిమానులు ఆసక్తితో ఉన్నారు. ఇందులో రానా అనే పాత్రలో రానా దగ్గుబాటి నటించారు. సిరీస్​లోనూ ఆయన అదే పేరు కొనసాగించారు. ఇక వెంకటేశ్.. రానా తండ్రి పాత్రలో వైవిధ్యంగా కనిపించారు. ఈ అప్​డేట్​పై అభిమానులు నెట్టింట్లో కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. దీంతో ఇన్నాళ్లు ఇలాంటి కాంబో కోసమే ఎదురు చూశామని కామెంట్లు పెడుతున్నారు.

సుధీర్ బాబు, శ్రీకాంత్​ 'హంట్​'..
సమ్మోహనం లాంటి మంచి హిట్​ చిత్రాలు ఇచ్చాడు సుధీర్​ బాబు. తాజాగా ఆయిన హీరోగా 'హంట్'​ అనే సినిమాలో నటిస్తున్నారు. ప్రముఖ నటుడు శ్రీకాంత్​, భరత్​ నివాస్​ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి మహేశ్​ సూరపనేని దర్శకత్వం వహిస్తున్నారు. భవ్య క్రియేషన్స్​ బ్యానర్​పై వి ఆనంద ప్రసాద్ నిర్మిస్తున్నారు. గిబ్రన్​ సంగీతం సమకూర్చుతున్నారు.

హంట్​

సినిమాటోగ్రఫీ: అరుల్​ విన్సెంట్​, కూర్పు: ప్రవీణ్​ పూడి తాజాగా ఈ చిత్రానికి సంబంధించి సుధీర్​ బాబు, శ్రీకాంత్​ పోస్టర్లను విడుదల చేశారు. సుధీర్ బాబు అర్జున్​ ప్రసాద్​గా అనే పాత్రలో కనిపించబోతున్నారు. శ్రీకాంత్​ మోహన్ భార్గవ్​ అనే పాత్రలో కలిపిస్తున్నారు. ఈ సినిమా టీజర్​ను శనివారం సాయంత్రం విడుదల చేయనున్నారు.

హంట్​

ఇవీ చదవండి:'ప్రేమలో ఉన్నప్పుడే బాధగా ఫీల్ అవుతా'.. అందాల ఊర్వశి పోస్ట్

'సలార్‌' షూటింగ్​ షురూ.. తమిళంలో దిశా పటానీ.. వరుణ్​ తేజ్​ యాక్షన్​ థ్రిల్లర్​

ABOUT THE AUTHOR

...view details