Rana Naidu Season 2 Update :టాలీవుడ్ స్టార్ హీరో దగ్గుబాటి వెంకటేశ్ - శైలేష్ కొలను కాంబోలో రానున్న సినిమా 'సైంధవ్'. తండ్రి కూతుళ్ల సెంటిమెంట్ పాయింట్‌తో ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతోంది. అయితే తాజాగా హైదరాబాద్‌లో సినిమా సాంగ్ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్లో పాల్గొన్న వెంకటేశ్.. 'రానా నాయుడు' వెబ్ సిరీస్ సీక్వెల్ గురించి మాట్లాడారు.
'సైంధవ్' సాంగ్ రిలీజ్ ప్రోగ్రామ్‌ను ఓ కాలేజీలో నిర్వహించారు. అయితే అక్కడ 'రానా నాయుడు' రెండో పార్ట్ గురించి ఓ స్టూడెంట్ అడగ్గా.. వెంకీ ఆయన రీతిలో సమాధానమిచ్చారు. ' రానా నాయుడు, వెళ్తున్ననామ్మ. జనవరి నుంచి స్టార్ అవుతుంది. నాగా నాయుడు మామూలోడు కాదు. నెట్‌ఫ్లిక్స్ వాళ్లు తీశారు. వరల్డ్‌వైడ్‌గా అందరూ చూసేశారు. మళ్లీ తీయమంటున్నారు. కుర్రాళ్లు చూశారు కానీ.. పెద్దవాళ్లు ఏంటి అలా చేశావ్'అని అన్నారన్నారు. అయితే రెండో పార్ట్‌లో కొంచెం జాగ్రత్తగా ఉంటూ, ఎవరినీ హర్ట్ చేయకుండా చూసుకుంటాన్నారు వెంకటేశ్. ఫస్ట్ సీజన్ చూసి చాలా మంది హర్ట్ అయ్యారు.. కానీ ఈసారి చక్కగా ఉంటుందని వెంకీ తెలిపారు. దీంతో తెలుగు ప్రేక్షకులకు నచ్చేలా.. రెండో సీనన్లో బోల్డ్ సీన్స్, బూతులు తగ్గవచ్చని అంటున్నారు.
Rana Naidu Season 1 :హాలీవుడ్ వెబ్సరీస్ 'రే డొనోవన్' ఆధారంగా ఇండియన్ నేటివిటికి తగ్గట్లుగా రూపొందింది రానా నాయుడు. ఈ వెబ్‌సిరీస్‌లో టాలీవుడ్ స్టార్ హీరో రానా దగ్గుబాటి కూడా నటించారు. దీనికి సుపర్న్ వర్మ, కరణ్ అన్షుమన్ దర్శకత్వం వహించారు. పలు ఎపిసోడ్లుగా రూపొందిన ఈ వెబ్‌సిరీస్‌లో బోల్డ్ కంటెంట్ కాస్త ఎక్కువైందని పబ్లిక్ టాక్. దీనికి తెలుగులో కంటే హిందీ, ఇతర భాషల్లో ఎక్కువ స్పందన వచ్చింది.