తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

లగేజ్‌ మిస్‌.. విమాన సిబ్బంది తీరుపై రానా ఫుల్​ సీరియస్​! - రానా వార్తలు

ఒక ప్రైవేట్​ ఎయిర్​లైన్స్​పై సినీ నటుడు రానా ఫుల్​ సీరియస్​ అయ్యారు. అదొక చేదు అనుభవమని అన్నారు. అసలేం జరిగిందంటే?

rana-daggubati-impatience-on-indigo-airline
rana-daggubati-impatience-on-indigo-airline

By

Published : Dec 4, 2022, 4:31 PM IST

ఒక ప్రైవేటు విమానయాన సంస్థ సిబ్బంది తీరుపై నటుడు రానా అసహనం వ్యక్తం చేశారు. తన లగేజ్‌ మిస్ అయిందని, స్టాఫ్‌ దాన్ని వెతికిపట్టుకోలేకపోయారని ట్విటర్‌ వేదికగా తెలిపారు. ఇలాంటి చెత్త అనుభవం తనకెప్పుడూ ఎదురవలేదన్న రానా.. ఆ సంస్థ అధికారిక ట్విటర్‌ ఖాతాను ట్యాగ్‌ చేశారు. తాము కల్పించే సదుపాయాలు, రక్షణ గురించి ఇటీవల ఆ సంస్థ ట్వీట్‌ చేయగా.. రానా వాటిని రీ ట్వీట్‌ చేస్తూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు.

'ఈ ఫ్లైట్స్‌ అనుకున్న సమయానికి టేకాఫ్‌కాకపోవచ్చు, ల్యాండ్‌కాకపోవచ్చు. మీ సామాను గురించి వారికి ఎలాంటి ఆధారాలు దొరకవు' అని వింటర్‌ సేల్‌ ఆఫర్‌ పోస్ట్‌పై రానా కామెంట్‌ చేశారు. దీనిపై పలువులు నెటిజన్లు, అభిమానులు స్పందించారు. గతంలో తమకు ఎదురైన అనుభవాలను కామెంట్ల రూపంలో రానాతో పంచుకుంటున్నారు. అయితే ఆ సంస్థ నుంచి ఎలాంటి స్పందన లేదు. తాను ఎక్కడ నుంచి ఎక్కడికి వెళ్తున్నారన్నది రానా వెల్లడించలేదు.

ABOUT THE AUTHOR

...view details