తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

ఇన్​స్టా పోస్టులన్నీ డిలీట్​ చేసిన రానా.. ట్విట్టర్​లో ప్రకటన.. ఆ కారణంతో.. - Rana Deletes All Posts

Rana Deletes All Posts on Instagram: టాలీవుడ్​ నటుడు రానా దగ్గుబాటి తన ఇన్​స్టాగ్రామ్​ పోస్టులన్నింటినీ డిలీట్​ చేశారు. ఒక్కటి కూడా ఉంచలేదు. కారణమేంటంటే?

Rana Daggubati Deletes All Posts on Instagram
Rana Daggubati Deletes All Posts on Instagram

By

Published : Aug 9, 2022, 7:06 PM IST

Rana Deletes All Posts on Instagram: ప్రస్తుతం స్మార్ట్‌యుగంలో సినీ తారలను అభిమానులకు ఎంతగానో దగ్గర చేశాయి సామాజిక మాధ్యమ వేదికలు. తాము చేసే కొత్త సినిమాలకు సంబంధించిన విశేషాలతో పాటు, వ్యక్తిగత విషయాలను కూడా సోషల్‌మీడియాలో షేర్​ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో నటుడు రానా ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన ఇన్‌స్టాగ్రామ్‌లోని అన్ని పోస్టులను డిలీట్‌ చేశారు. కొంతకాలం తాను సోషల్‌మీడియాకు దూరంగా ఉండాలనుకుంటున్నట్లు ఆగస్టు 5న ప్రకటించిన ఆయన తాజాగా ఇన్‌స్టా పోస్టులను తీసేశారు.

ఖాళీగా దర్శనమిస్తున్న రానా ఇన్​స్టా ప్రొఫైల్​

'కొంతకాలం సోషల్‌మీడియా నుంచి విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నా. మళ్లీ మూవీల్లో కలుద్దాం. బిగ్గర్​.. బెట్టర్.​. స్ట్రాంగర్.​. మీపై అమితమైన ప్రేమతో.. రానా' అని ఆగస్టు 5న ట్వీట్‌ చేశారు. అన్నట్లుగానే ఇన్‌స్టా పోస్టులను డిలీట్‌ చేశారు. మరి ట్విట్టర్​లో అలా ఏం చేయలేదు.
రానా సినిమాల విషయానికొస్తే, ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'విరాటపర్వం' మిశ్రమ స్పందనలు అందుకుంది. ప్రస్తుతం బాబాయ్‌ వెంకటేశ్‌తో కలిసి నెట్‌ఫ్లిక్స్‌ వెబ్‌సిరీస్‌ 'రానానాయుడు'లో నటిస్తున్నారు. తేజతో సినిమా చేయనున్నట్లు ప్రకటించినా దానిపై మళ్లీ ఎలాంటి వార్తలూ రాలేదు. అలాగే 'హిరణ్యకశ్యప' అనే పౌరాణిక చిత్రం చేస్తానని కూడా రానా ప్రకటించారు.

ABOUT THE AUTHOR

...view details