తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

Rana Apologizes : ప్రముఖ హీరోయిన్​కు రానా క్షమాపణలు.. అలా జరిగినందుకు చాలా బాధగా ఉందంటూ - dulquer salman king of kotha

Rana Apologizes : టాలీవుడ్ నటుడు రానా బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్​కు క్షమాపణలు చెప్పారు. తాను చేసిన వ్యాఖ్యలు తప్పుగా అర్థంచేసుకున్నారని, అందుకు తనను క్షమించమని కోరారు. ఏం జరిగిందంటే..

Rana Apologizes :  ప్రముఖ హీరోయిన్​కు రానా క్షమాపణలు..  అలా జరిగినందుకు చాలా బాధగా ఉందంటూ
Rana Apologizes : ప్రముఖ హీరోయిన్​కు రానా క్షమాపణలు.. అలా జరిగినందుకు చాలా బాధగా ఉందంటూ

By

Published : Aug 15, 2023, 3:11 PM IST

Rana Apologizes : టాలీవుడ్ విలక్షణ నటుడు రానా దగ్గుబాటి.. గతంలో తాను చేసిన వ్యాఖ్యల విషయంలో తాజాగా క్షమాపణలు చెప్పారు. బాలీవుడ్ నటి సోనమ్ కపూర్​కు క్షమించమని కోరారు. రీసెంట్​గా హైదరాబాద్​లో జరిగిన ఓ ఈవెంట్​లో రానా.. హీరో దుల్కర్​ సల్మాన్​ను పొగడే క్రమంలో పేరు ప్రస్తావించకుండా ఓ హీరోయిన్​ గురించి మాట్లాడారు. దీంతో నెటిజన్లంతా సోనమ్​కపూర్​ను ఫుల్ ట్రోల్​ చేస్తున్నారు. ఆమెపై వ్యతిరేకత పెరిగిపోయింది. ఈ క్రమంలోనే రానా సారీ చెప్పారు.

"నా వ్యాఖ్యల కారణంగా సోనమ్ కపూర్​కు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారంపై తీవ్రంగా ఇబ్బంది పడ్డాను. అది పూర్తిగా నిజం కాదు. నిజానికి అది ఎంతో తేలికగా తీసుకోవాల్సిన విషయం అది. స్నేహితులలా మేము సరదాగా ఆట పట్టించుకుంటుంటాం. నా వ్యాఖ్యలు తప్పుగా అన్వయం అయినందుకు విచారం వ్యక్తం చేస్తున్నాను. అందుకే సోనమ్ కపూర్-దుల్కర్​కు హృదయపూర్వకంగా క్షమాపణలు చెబుతున్నాను. వారిద్దరినీ నేను ఎంతో గౌరవిస్తాను. తప్పుగా అన్వయం అయిన నా వ్యాఖ్యలకు ఈ వివరణ ముగింపు పలుకుతుందని భావిస్తున్నాను" అని రానా వివరించారు.

దుల్కర్ సల్మాన్ నటించిన కింగ్ ఆఫ్ కొత్త ఆగష్టు 24న రిలీజ్​ కానుంది. దీంతో హైదరాబాద్​లో రీసెంట్​గా ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించారు. ముఖ్య అతిథిగా నేచురల్ స్టార్ నానితో పాటు రానా హాజరయ్యారు. ఈ సందర్భంగా రానా మాట్లాడుతూ... "దుల్కర్ చాలా సహనంగా ఉంటారు. చాల సింపుల్ కూడా. అందుకే దుల్కర్ వైల్డ్ యాక్షన్ సినిమా చేయడం నాకు ఎంతో ఎగ్జైటింగ్​గా అనిపించింది. గతంలో దుల్కర్ సల్మాన్ చేసిన ఓ హిందీ మూవీ నిర్మాతలు నా ఫ్రెండ్స్. ఆ సినిమా చిత్రీకరణ హైదరాబాద్​లో జరగుతున్నప్పుడూ సెట్స్​కి వెళ్ళాను. ఆ చిత్రంలో నటిస్తున్న ఓ బాలీవుడ్ హీరోయిన్ షాపింగ్ గురించి భర్తతో ఫోన్​లో మాట్లాడుకుంటూ ఉంది. దుల్కర్​ను వెయిట్ చేయించింది. టేకుల మీద టేకులు తీసుకుంది. మధ్య మధ్యలో ఫోన్స్ మాట్లాడుతూ ఉంది. కానీ దుల్కర్ మాత్రం ఎండలో సహనంగా ఎదురు చూస్తూనే ఉన్నాడు. చివరికి నా సహనం కూడా తగ్గిపోయింది. దుల్కర్ మాత్రం కామ్ గా ఉన్నారు" అని రానా చెప్పుకొచ్చాడు.

దీంతో ఆ హీరోయిన్​ సోనమ్ కపూర్ అని సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది. ఆమెపై నెగిటివిటీ ఎక్కువైపోయింది. ఆమెకు క్రమశిక్షణ లేదంటూ అందరూ కామెంట్లు పెడుతూ ట్రోల్ చేస్తున్నారు. దీంతో రానా స్పందించాల్సి వచ్చింది. సోషల్​మీడియా వేదికగా సోనమ్​ కపూర్​కు క్షమాపణలు చెప్పారు. ఆమెను ట్రోల్​ చేయడం బాధించిందని చెప్పుకొచ్చారు.

ట్యూషన్ ఫీజు​ డబ్బులతో వడ్డీ వ్యాపారం.. చిన్నప్పుడే రానా దందా!

లగ్జరీ బంగ్లా.. ఖరీదైన కార్లు.. 'రానా' లైఫ్ స్టైల్ చూస్తే అవాక్కవ్వాల్సిందే!

ABOUT THE AUTHOR

...view details