Rajinikanth Ramyakrishna: సూపర్‌స్టార్ రజనీకాంత్-రమ్యకృష్ణ కాంబినేషన్ అనగానే ఎవరికైనా గుర్తొచ్చే సినిమా 'నరసింహ'. ఆ చిత్రంలో నీలాంబరిగా రమ్యకృష్ణ కనబరిచిన అభినయం ప్రేక్షకుల్ని ఫిదా చేసింది. ఈ పాత్రను రమ్యకృష్ణ అద్భుతంగా చేశారని రజనీ సైతం పలు సందర్భాల్లో మెచ్చుకున్నారు. అయితే ఇప్పుడీ కాంబో మరోసారి రిపీట్ కానుందని తెలుస్తోంది.
రజనీకాంత్‌కు మరోసారి విలన్‌గా రమ్యకృష్ణ! - రజనీకాంత్ రమ్యకృష్ణ నరసింహ
Rajinikanth Ramyakrishna: సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు సీనియర్ నటి రమ్యకృష్ణ మరోసారి విలన్‌గా నటించనున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. ఇంతకీ ఆ సినిమా వివరాలేంటో తెలుసుకుందాం..
రజనీ తన తర్వాత సినిమాను నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో నటిస్తున్నారు. సన్‌పిక్చర్స్ నిర్మిస్తోంది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతుంది. ప్రస్తుతం స్క్రప్ట్ వర్క్‌కు ఫైనల్ టచ్ ఇవ్వడంతో పాటు నటీనటులను ఎంపిక చేసే ప్రక్రియలో నెల్సన్ ఉన్నారట! ఐశ్వర్యరాయ్, ప్రియాంక అరుల్ మోహన్ కీలక పాత్రల్లో.. విలన్‌గా రమ్యకృష్ణను తీసుకోవాలని యోచిస్తున్నారని తెలిసింది. ఇప్పటికే రమ్యకృష్ణను కూడా సంప్రదించారట. కథ నచ్చి ఆమె గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని సినీవర్గాల టాక్. త్వరలోనే దీనిపై అధికార ప్రకటన వచ్చే అవకాశముంది. దీంతో రజనీకి విలన్‌గా రమ్యకృష్ణ పేరు వినపడగానే అభిమానుల్లో ఈ చిత్రంపై విపరీతంగా అంచనాలు పెరిగిపోయాయి.
ఇదీ చూడండి: పాన్ ఇండియా ఒత్తిడిలో ఆ చిత్ర పరిశ్రమలు!