తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

నరేశ్​-పవిత్రతో తగాదా పడిన రమ్య.. చెప్పుతో కొట్టేందుకు యత్నం! - నరేశ్​ రమ్య రఘుపతి

Naresh Pavitra lokesh relation: ఓ హోటల్​లో బస చేస్తున్న తన భర్త​-పవిత్రా లోకేష్​ దగ్గరకు వెళ్లి తగాదా పడ్డారు నరేశ్​ భార్య రమ్య రఘపతి. ఈ క్రమంలోనే ఆమె పవిత్రను కొట్టబోయారని తెలిసింది.

Naresh Pavitra lokesh
నరేశ్​-పవిత్రతో తగాదా పడిన రమ్య

By

Published : Jul 3, 2022, 12:20 PM IST

Updated : Jul 3, 2022, 2:06 PM IST

నరేశ్​-పవిత్రతో తగాదా పడిన రమ్య

Naresh Pavitra lokesh relation: గత కొన్నిరోజులుగా చిత్రసీమలో నరేశ్​, పవిత్రా లోకేష్​, రమ్య రఘుపతి వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. అయితే ఇప్పుడీ సమస్య మరింత ముదిరింది. ఇప్పటికే నరేశ్​-పవిత్ర జంట, రమ్య.. మీడియా ముందుకు వచ్చి ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా మైసూర్​లో నరేశ్​-పవిత్ర కలిసి ఉన్న హోటల్​కు వెళ్లిన రమ్య.. వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. వారితో తగాదా పడ్డారు. నిలదీసేందుకు ప్రయత్నించారు. కానీ, ఆమెను పోలీసులు, సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే రమ్య.. పవిత్రను చెప్పుతో కొట్టేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. అయితే సిబ్బంది ఆమెను నిలువరించారు. ఆ సమయంలో నరేశ్​.. రమ్యను ఉడికించే ప్రయత్నం చేశారు. అక్కడి లిఫ్ట్​లో ఎక్కుతూ.. ఈలలు వేస్తూ, గేలి చేశారు. అంతేకాకుండా రమ్యని చూపిస్తూ.. ఆమె పిచ్చిది, ఫ్రాడ్​ అంటూ ఆరోపణలు చేశారు. కేకలు వేస్తూ.. నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్​గా మారింది.

ఇదీ జరిగింది.. నరేశ్​-పవిత్రా.. కలిసి పలు సినిమాల్లో జంటగా నటించారు. అయితే గత నాలుగేళ్లుగా ఈ జంట సహజీవనం చేస్తున్నారని, వివాహం చేసుకోబోతున్నారని కొద్ది రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. ఈ పుకార్లకు ఊతం ఇస్తూ.. నరేశ్​-పవిత్రా.. పలు ప్రైవేట్​ ఈవెంట్లతో పాటు గుడిలో కనిపించడం వల్ల.. ఈ జంట పెళ్లి పీటలు ఎక్కబోతుందనే వార్త ఊపందుకుంది. ఈ క్రమంలోనే నరేశ్​పై అతడి భార్య రమ్య, పవిత్రపై ఆమె భర్త సుచేంద్ర ప్ర‌సాద్.. తీవ్ర ఆరోపణలు చేశారు. అయితే వీటిపై స్పందించిన నరేశ్​-పవిత్ర వాటిని ఖండించారు. అవన్నీ అవాస్తమని కొట్టిపారేశారు. కాగా, గత కొన్నేళ్లుగా నరేశ్​-రమ్య, పవిత్ర-సుచేంద్ర మనస్పర్థల కారణంగా విడిగా ఉంటున్నారు.

ఇదీ చూడండి: నరేశ్​-పవిత్ర బంధం.. మధ్యలో ట్విస్ట్​.. అసలేం జరుగుతోంది?

Last Updated : Jul 3, 2022, 2:06 PM IST

ABOUT THE AUTHOR

...view details